Tuesday, October 25, 2022

259. జీవన పల్లవి

 

జీవన పల్లవి



• మనసు  సంయోగాల  సంగమం

  వైవాహిక  స్వాంతం

  మనిషి  సంయోజన  శ్రేష్టం

  మధురమైన  జీవితం


• రాగం విడిచే గానం

  భావం కలిపే జీవం


• సత్వ తమో రజో గుణాల వికారాల నుంచి విముక్తి పోందిన మనసు,   వివాహ బంధం అనే కలయిక తో కలిసినపుడు,  మనిషి ఆలోచనలు మధురమైన జీవితానికి ఉత్తమం గా ఉంటాయి.


• రాగం లోని గానం భావమై జీవం తో కలుస్తుంది.

🌟🌟🌟🌟🌟


• కాలం  కదలని  సమయం

  ఆస్వాంతం   స్తంభనం

  శాంతం  కలిగిన   మేళనం

  జీవన్ముక్తి కి  సోపానం


• శ్రావ్యం  పోసెను  ప్రాణం

  చరణం  చేసెను  లయం


• కాలం కలిసిరాని సమయంతా నిర్లిప్తత తో హృదయం స్తంభించి పోతుంది. శాంత స్వభావుల కలయిక జీవన ముక్తి కి ఎదుగుదల అవుతుంది.


• మధురమైన గొంతు కి  పద్యపదం  ప్రాణం మవుతుంది.

🌟🌟🌟🌟🌟


• శూన్యం    తరగని   తరంగం

  అంతరింద్రయ   చదరంగం

  బీజం   వేసిన   సంసృష్టం

  వీక్షణం లేని  సూక్ష్మం


• పల్లవి   సాగెను  సాంతం

  శృతి లో  కలిసే  సంగీతం

 

• అంతరంగం లోని ఇంద్రియములు (బుద్ది, మనసు, ఆలోచన, అహం), విత్తనం (ఆత్మ) తో సంయుక్తంగా కలిసిపోయి సూక్ష్మాతి సూక్ష్మమై శూన్యంలో ఉంటూ కనిపించకుండా తరగని అలలు వలె చదరంగం ఆడుతాయి.


• పరిపూర్ణమైన జీవన పల్లవి శృతి లో కలిసిన సంగీతం వలె సృష్టిలో ఐక్యమవుతుంది.


యడ్ల శ్రీనివాసరావు 25 Oct 2022 12:45 pm







No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...