వదలకు నా తండ్రి శివా
• వదలకు నా తండ్రి శివా
వదలకు
నా చేయి వదలకు
• జన్మ జన్మలు గా కానరాని
వాడివి
కరుణ తో కలిసావు
మమత ను పంచావు.
• వదలకు నా తండ్రి శివా
వదలకు
నా చేయి వదలకు
• వదిలితే మాయ లోకం లో
మసకబారి పోతాను.
• దేహం వదులుతా నని
రోదిస్తే వచ్చావు
• నేనెవరి నని అడిగితే
నా చేయి పట్టావు
• ఇది ఏ జన్మ భాగ్యమో
ఇది ఏ కర్మ ఫలమో.
• పిలిచిన మాటలో పలుకుతునే ఉన్నావు
• తలచిన కనుల లో నిలుస్తునే ఉన్నావు
• మన బంధమేమిటో చెపుతూనే ఉన్నావు.
• వదలకు నా తండ్రి శివా
వదలకు
నా చేయి వదలకు
• వదిలితే అంధుడి నై
ఇంకెన్ని జన్మలు ఎత్తేది.
• నీ స్మరణ యే నా కర్మము
నీ బంధమే నా బుణము.
• ఈ ఊపిరి నీది … ఈ చలనం నీది
ఈ జీవం నీది … ఈ దేహం నీది
• సిద్దము తో సిద్దుడినై సంసిద్ధముగా ఉన్నాను
• నీ కనుసైగ కై ఎదురు చూస్తూ నే ఉన్నాను.
• వదలకు నా తండ్రి శివా
వదలకు
నా చేయి వదలకు
• జన్మ జన్మలు గా కానరాని
వాడివి
కరుణ తో కలిసావు
మమత ను పంచావు
• బాధ్యతలు
కరిగించి
నీ చేత నే తీసుకుపో
• ఈ ఆనందం
దివ్యా నందం
నిత్యా నందం
సత్యా నందం
పరమానందం
• ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఆత్మం సమర్పయామి
ఓం నమఃశివాయ ఆత్మం సమర్పయామి
ఓం నమఃశివాయ దేహం సమర్పయామి.
🙏
యడ్ల శ్రీనివాసరావు 28 October 2022 , 2:00 AM.
No comments:
Post a Comment