Wednesday, October 26, 2022

260. శివ రూపం

 శివ రూపం



• శివ రూపం   శివ రూపం

  శిలను శిల్పం  చేసే   మనోహరం

• శివ రూపం   శివ రూపం

  శిధిలానికి  జీవం పోసే   సాకారం

• జన్మ జన్మల  కర్మభోగం

  చిద్విలాసు ని   సాక్షాత్కారము


• శివ రూపం   శివ రూపం

  శిలను శిల్పం   చేసే మనోహరం


• నీ కంఠ మాలలో  రుద్రము    అక్షమై

  కంటి నీటి న   కారుతున్న దే    కైవల్యం.


• నీ సిగ మాటున  చంద్రము    జ్ఞానమై

  సెలయేరు లా   జారుతున్న దే   ఆహార్యం.


• శివ రూపం    శివ రూపం

  శిధిలానికి  జీవం  పోసే   సాకారం


• నీ మదిన  నిలిచిన   ధ్యానము    ధ్యాస యై

  వెన్ను న ఆడేటి   నృత్య మే   జాగృతం.


• నీ భృకుటి  ధారణ   నేత్రము    రక్ష యై

  నిశీధి  నేలేటి   దుష్ట శక్తుల  పరిరక్షణం


• శివ రూపం    శివ రూపం

  శిలను శిల్పం   చేసే  మనోహరం

• శివ రూపం    శివ రూపం

  శిధిలానికి   జీవం పోసే   సాకారం

• జన్మ జన్మల   కర్మభోగం

  చిద్విలాసు ని   సాక్షాత్కారము.


యడ్ల శ్రీనివాసరావు 26 Oct 2022 2:00 pm






No comments:

Post a Comment

622. ప్రణతి

  ప్రణతి • ప్రియము న      ప్రణతి   ప్రీతి  న      ప్రణయతి . • నగవు తో      నడిచిన   మనసు కి      ఉన్నతి . • సారిక     . . .   అభిసారిక    ...