Sunday, October 30, 2022

265. ఆత్మ జ్యోతి

 

ఆత్మ జ్యోతి



• వెలిగింది  జ్యోతి    ఆత్మ జ్యోతి

  వెలిగింది  జ్యోతి    ఆత్మ జ్యోతి

• కన్నీరు   తైలము గ

  దేహ  మనే   ప్రమిద లో

• వెలిగింది  జ్యోతి   ఆత్మ జ్యోతి


• కన్నీరు ఇంకినా    తైలము కరిగినా

  దేహము కాలిన     ప్రమిద యే పగిలినా

• ఆత్మ   దేదీప్యమై

  పరమాత్మని కోసం  పయనము  అయింది.


• వెలిగింది  జ్యోతి    ఆత్మ జ్యోతి

  వెలిగింది  జ్యోతి    ఆత్మ జ్యోతి


• రూపము లేని    పరమాత్మ  శివుడు

  అనుభవము నే   ఆసరా  అయ్యాడు


• ఏమని చెప్పాలి    ఎలా చెప్పాలి

  శివుడు   శక్తి యై   ఉన్నాడని

  యుక్తి నే   చేయిస్తున్నాడని.


• ధ్యాన మనే యోగము తో 

  దరి చేర్చుకున్నాడు

  జ్ఞాన మనే అమృతము ను 

  ధారణ చేస్తున్నాడు


• వెలిగింది  జ్యోతి    ఆత్మ జ్యోతి

  వెలిగింది  జ్యోతి     ఆత్మ జ్యోతి

• కన్నీరు   తైలము గ

  దేహ మనే   ప్రమిదలో

• వెలిగింది  జ్యోతి   ఆత్మ జ్యోతి


• జ్యోతి లోని    ప్రకాశం

  జన్మాంతర  జ్ఞాపకాలు   తెరుస్తుంటే

  దివ్యమైన  శివుని కి   ఎంత  చేరువై  నానో

  ఏ జన్మ భాగ్యమో   ఏ పుణ్య ఫలమో


• శివనామ స్మరణము 

  శతకోటి పాపాల హరణము

  పరమాత్మని స్మరణము 

  జీవన్ముక్తి సోపానం.


యడ్ల శ్రీనివాసరావు 30 Oct 2022 10:00 pm








No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...