Saturday, October 29, 2022

264. మేలుకో మానవ మేలుకో

 

మేలుకో మానవ మేలుకో



• మేలుకో   మానవ   మేలుకో

  శివుని     జ్ఞానము  తెలుసుకో.

• నేను  నేను   అంటావు

  ఆ  “నేను”  మూలం  ఏమిటో   తెలుసుకో.


• కనులు  మూసుకొని  కోరికలు

  కోరేందుకు  కాదు రా   నీ జన్మము.

 

• నీ  కర్మను  తెలుసుకొని

  కరిగించుకుంటే  నే

  సార్ధకం  నీ జన్మ  సార్థకం.


• భక్తి  భక్తి   అంటావు

  భక్తి తో  నీకు  దుర్గతే

  కానీ

  సద్గతి  ఏనాటి  కో.


• భక్తి లోన  సుఖము  ఆవగింజే

  కానీ

  ఆకాశమంత  కాదురా  మానవా.


• మేలుకో    మానవ    మేలుకో

  మేలుకొని  శివుని  జ్ఞానము   తెలుసుకో.

• నేను  నేను  అంటావు

  ఆ  “నేను”  మూలం ఏమిటో   తెలుసుకో.


• గర్భం లో   లెక్కలు  వేసుకొని  పుడతావు

  గతి తప్పి  లెక్కలే  మరచిపోతావు

  అందుకే  కదా

  లెక్క లేనిది  గ    మారింది    నీ  జీవితం.


• శివుని    జ్ఞానం   నీకు  తెలియాలంటే

  నీలో ని   మౌఢ్యం   నువ్వు  తెలుసుకో.


• నాది  నాదంటూ   నరకమున  ఉంటావు.

• వారు  నా  వారంటు

  వీరు   నా   వారంటు

  మాయలో  పడి  మసిబొగ్గు  అవుతావు.

• నీవెవరివో    తెలియని   నీకు

  నీ వారు   ఎవ్వరు  రా   మానవా.

 

• మేలుకో  మానవ  మేలుకో

  మేలుకొని  శివుని   జ్ఞానము  తెలుసుకో.

• నేను  నేను  అంటావు

  ఆ   “నేను”  మూలం  ఏమిటో   తెలుసుకో.

 

• నాటకం లోని   పాత్రధారి వి    నీవు

  నీ  నాటకం  ఏమిటో 

  తెలియకపోవడమే   జగన్నాటకం.


• జ్ఞాన సాగరుని     చేరాలంటే

  ధ్యాన సాగరం లో   మునగాలి.

  సేవ నే   శక్తి గా     మలచాలి.

  యుక్తి నే   ముక్తి గా   తలచాలి.


• మేలుకో   మానవ   మేలుకో

  మేలుకొని   శివుని   జ్ఞానము   తెలుసుకో.


వివరణ :

  భక్తి భక్తి అంటావు  భక్తి తో నీకు దుర్గతే

  కానీ   సద్గతి ఏనాటి కో.

క్షమించాలి.... నేటి కాలంలో చేసే భక్తి,  భగవంతుని మీద ధ్యాస కంటే కూడా  కోరికలు, ఆడంబరాలు, వృధా ఖర్చులు , అవసరాలు కోసం,  ఇంకా  వ్యాపార దృక్పథం ఎక్కువ శాతం మనుషుల లో మరియు దేవాలయాల వ్యవస్థ నిర్వహణ లో ఉంది.  దీని వలన అధోగతే కాని సద్గతి పొందలేరు.  దేవుని ఎదుట నిలబడి మొక్కడం, ఏదో గుడికి రిలాక్సేషన్ కోసం , రిక్రియేషన్ కోసం వెళుతున్నాం అనే భావన చాలా మంది మనసులలో అంతర్గతం గా ఉంది. అలాంటి భక్తి చేసే వారి కి ఏ మాత్రం ఒక శాతం  ప్రయోజనం ఉండదు.  సుఖం, శాంతి లభించదు, అని చెప్పడం ఈ వాక్యం యొక్క ఉద్దేశం.  భగవంతుని పై నమ్మకం, విశ్వాసం నిజాయితీ గా ఉంటే, మనిషి తనను తాను మానసికంగా వదులుకుని , తనువు మనసు ధనం భగవంతుని కి అర్పించినపుడే , భగవంతుడు మనిషి ని చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇది కొంచెం అర్దం కావాలి, ఈ స్థితి పొందాలి అంటే పరమాత్మ అయిన శివుని జ్ఞానం మనిషి లో జాగృతం కావాలి.🙏


భగవంతుని పై భక్తి   భయం తో,  స్వార్థం తో  కాదు ప్రేమ తో  ఉండాలి. 


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 30 Oct 2022 12:30 AM









No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...