Saturday, October 15, 2022

255. స్నేహ మిథునం

 

స్నేహ మిథునం



ఇవి 👇 మీ కంటి ముందు ఉన్న నిజాలు.

ఈ రచన 2022 October 15 న రాయబడింది.

ఆఖరి లో "చివరి మాట" మాత్రమే నేడు update చేయబడింది. మిస్ కాకుండా చదవండి.

దయచేసి ప్రశాంతంగా  ఉన్న సమయంలో మాత్రమే , పది నిమిషాలు కేటాయించి ఈ రచన  పూర్తిగా చివరి వరకు చదవమని  విజ్ఞప్తి 

🙏

(మనసు ఉన్న వారు ఆలోచించ గలిగే అంశాలు చాలా ఉంటాయి. ఒకటి రెండు సార్లు, చివరి వరకు తప్పకుండా చదవండి.)

 ప్రేరణ 

(ఈ రచన  ఎవరిని విమర్శించడానికి కాదు🙏.  

ఈ రచన అనేక మనసులకు  దర్పణం. 

 "మనం స్నేహం అనే బంధం లో  ఎక్కడ ఉన్నాం" అనే ఒక చిన్న ఆలోచన కోసం ...) 

 స్నేహం అనే మాట ను గౌరవించడం కోసం.  మానవ స్వభావాలను, అనుభవాలను  ప్రామాణికంగా తీసుకొని రాయబడింది. )

🌹🌹🌹

• ఈ మధ్య కొంత కాలం నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ పుణ్యమా అని సుమారు 1980 ల  కాలం నుంచి కూడా కలిసి చదువుకున్న ఎంతో మంది బాల్య స్నేహితులు , ముఖ్యం గా SSC చదువుకున్న వారందరూ వివిధ ఊర్లలో తాము చదువుకున్న స్కుళ్లలో   రీ యూనియన్  అని  ఆత్మీయ కలయిక అని  కలుసుకుంటున్నారు.  నేటికీ ఉన్న  తమ టీచర్లను సత్కరిస్తున్నారు.  ఈ  స్నేహితులు  అందరూ  50 సంవత్సరాలు నిండిన వారు.  ఇది ఆరోగ్యకరమైన పరిణామం.   వీరిలో కొందరు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసిన వారు,   జీవితం లో బాగా స్థిరపడిన వారు, ఇంకా  మరికొందరు  ఎన్నో  రకాల  సమస్యలతో  జీవితాన్ని  ఒడిదుడుకులతో ఈదుతున్నవారు  ఉంటున్నారు.  ఇలా  కలగూర గంప లా  వివిధ రకాల  మనస్తత్వాలతో  పరిణితి చెంది,  చెందక   ఉన్న  వీరందరూ కూడా  చెప్పుకోవడానికి  మంచి స్నేహితులే.  ఎందుకంటే బాల్యం లో అందరూ కలిసి ,  ఒకే చోట కూర్చుని ఎన్నో సంవత్సరాలుగా చదువుకున్న వారు.


• రీ యూనియన్ రోజు అందరూ పలకరింపులు, ఆప్యాయతలు , కబుర్లు అయిపోయాక,  ఫోన్ కాంటాక్ట్స్ తీసుకుని ,  ఆ రోజు సాయంత్రం వెళ్లి పోయేటప్పుడు  " జీవితంలో అంత మంచి రోజు తిరిగి రాదని , వారందరి స్నేహం చాలా విలువైనవదని , ఎంత కాలం జీవిస్తామో తెలియదు కానీ మరణించే వరకు అందరూ  కలిసి ఉండాలని,"   ఎన్నో  మధురస్మృతులు  పంచుకొని ఎంతో బాధగా,  కొందరైతే  కన్నీళ్లతో  ఆ రోజు ఇళ్లకు వెళ్లి పోతారు.

• ఆ తరువాత  అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారు. తరచూ చిన్న తనం లో అనుభవాలు ఫోన్ ద్వారా షేర్ చేసుకుంటారు.  ఇలాంటి సమయంలో, అందరూ ఒకే రకమయిన మనస్కులు లా కనిపిస్తారు, అనిపిస్తారు.  రోజులు గడిచే కొద్దీ ప్రతీ ఒక్కరూ విడి విడిగా దాదాపు అందరు  మిత్రులతో , మిత్రురాళ్లతో   (సంఖ్యను బట్టి 30, 50, 100 మంది) మాట్లాడుకుంటూ  ఉంటారు.   సాన్నిహిత్యం పెంచుకుంటారు.   ఎందుకంటే స్నేహం లో ఉన్న మాధుర్యం అటువంటిది. అప్పటికే  (రా)బంధువులతో విసిగి పోయిన వీరందరికి ,   మిత్రుడు  అనే వాడు ఒక స్వతంత్ర్యం గా   కనిపిస్తాడు.   ఎందుకంటేే  యే కల్మషం ఎరుగని బాల్యం లో  కలిసి  పెరిగిన వాడు  మిత్రుడు కాబట్టి.  ఇందులో  ఆడ, మగ విడివిడిగా,  మరియు కలిసి కూడా ఉంటారు.  

బుద్ధి,  ఆలోచన, ప్రవర్తన  మంచివి గా  ఉంటే,   50 సంవత్సరాలు దాటిన  ప్రతి  స్నేహితుడికి  తన  జీవితంలో    ఈ ఆత్మీయత కలయిక  అనేది  ఒక  దివ్య  ఔషధం .... సజావుగా  జీవితం చివరి వరకు నిలబెట్టు కుంటే  ఒక అదృష్టం.

🍀🍀🍀🍀🍀🍀🍀

• మనిషి కి  బాల్యం  నుంచి  యవ్వనం దాటి వచ్చేటప్పటికి  మనస్తత్వం,  వ్యక్తిత్వం  చాలా  మారుతుంది.  తన  జీవితంలో  తల్లి తండ్రులు  పెంపకం తో కూడిన సంస్కారం  మరియు  బడిలో ఉపాధ్యాయుల ద్వారా  నేర్చుకున్న విలువలు,  తాను చదివిన  చదువులు,   ప్రస్తుతం  తనతో  ముడిపడిన  కుటుంబ బంధాలతో   ఉన్న   తీపి చేదు  అనుభవాల ఒత్తిడి,  వృత్తి రీత్యా  జీవితం లో సాధించిన జయాపజయాల ప్రభావం,   మరియు సామాజిక  ఆర్థిక  స్థితిగతుల   ప్రభావం తో ,   ఈ  ప్రస్తుత  వయసు లో  ప్రతి మిత్రుడు/మిత్రురాలి  మానసిక స్థితి  ఉంటుంది,  అనేది  పూర్తిగా  అక్షర  సత్యం.    

మిత్రులందరికీ,  రీ యూనియన్  జరిగిన సమయంలో  చాలా కాలం తరువాత,  అందరిని చూసిన   ఆ  ఆనంద సమయం లో  మాత్రమే    బాల్యం యొక్క  అనుభవం స్థితి,  ఆ ప్రేరణ  ప్రభావం  గొప్ప గా,  పులకింత గా  ప్రతీ ఒక్కరికీ  అనిపిస్తుంది.  ఇందులో ఏ సందేహాం లేదు. 


• ఏదో  సమయం కోసం ఇన్నాళ్లు  వేచి ఉన్నట్లు,  కొందరి మిత్రులలో  ఇక్కడి నుంచే,  తమ  మనసు లో అంత కాలం  దాచిపెట్టిన  అంతర్గత  శత్రువులైన  ఈర్ష్య,  ద్వేషం, కామం, అసూయ, అహంకారం అనే  పంచ వికారి గుణాలు  విపరీతం గా,  తమ లోపలి నుంచి  హద్దులు లేకుండా బయటకు రావడం మొదలవుతుంది....  వయసు పెరిగిన కొద్దీ  ఎవరికీ  జవాబు దారీ తనం లేకపోవడం,  పైగా  స్వేచ్ఛ అధికంగా  ఉండడం  వలన  విచక్షణ కోల్పోయి  తోటి బాల్య మిత్రుల/ మిత్రురాళ్లు  పై  తమ లోని వికారీ గుణాలను, అతి తెలివి తో  చూపిస్తూ , ఆనందం  పొందుతూ  ప్రవర్తించే వారు  ప్రతీ చోటా  తప్పకుండా  కొందరు  ఉంటారు .... ఉన్నారు.   అంత కాలం  కలిసి  చదువుకున్న   వీరిలో  స్నేహం,  స్నేహం లోని  ప్రేమ,  స్నేహం లోని  విలువ ,  గౌరవం  ఎక్కడికి  పోతాయో  వారి  రాతి  బుద్ధి కే  తెలియదు. 

అందరూ  మిత్రులే  అయినప్పటికీ కూడా ,  ఒకరికి లేనిది మరొకరి దగ్గర  ఉండడం,  పొందడం చూసి అసూయ మొదలవుతుంది.  ఓర్వలేని  తనం తో  విచక్షణ కోల్పోయి  సాటి బాల్య మిత్రులని బాధ పెట్టడానికి ఎలాంటి  నీచ మైన  మాటలైనా మాట్లాడుతూ,  అకృత్య కార్య కలాపాలకు  ఒడిగడతూ  కొందరు ఉంటారు.  పైగా  అది తమ  హక్కు గా భావిస్తారు. అది  టాలెంట్ గా ఫీల్ అవుతారు.  ఇందులో వేసే ఎత్తులు, పై ఎత్తులు రాజకీయ నాయకులు కూడా వీరికి సరి రారు .


• ఇందులో  ఉచ్ఛం నీచం లేకుండా ఎంతకైనా తెగిస్తారు. ఇలా  ఆడవారి లో,  మగ వారి లో  కూడా  కొందరు మాత్రం తప్పకుండా  చాలా చోట్ల  ఉంటారు.  చెప్పాలంటే,  నేడు  ఇలా ఉండడం అనేది వారి  మానసిక బలహీనత  లేదా   వారు  తమ జీవితం లో  నేటికీ అనుభవిస్తున్న  చేదు అనుభవాల పరిస్థితులు,  వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు, తమ సంసారిక సమస్యలు.  ఇలా ఒక అసంతృప్తి తో జీవితం గడుపుతూ  ఉన్న వీరికి  తమ తోటి మిత్రులు   కొందరు  ఆనందం గా కనిపిస్తూ ఉండేటప్పటికి ,  తమకు దక్కకనివి   ఇతరులకు దక్కుతున్నాయి అనే ఆలోచన తో,   జీవితం లో తాము ఓడిపోయాము,  సుఖంగా  లేము  అనే భావనలు  పెరిగి   తట్టుకోలేక  తమ  బాల్య స్నేహితుడు,    బాల్య స్నేహితురాలు   అని కూడా చూడకుండా  వయసు మీరినా  సరే నోటికి వచ్చినట్లు చెడు మాట్లాడుతూ, కుట్రలు  కుతంత్రాలతో  ఏదోక  నిందలు మోపి  , అదొక  ఉత్తమ మైన  కార్యంలా  విజయం సాధించినట్లు  ఆనందం పొందుతూ,  చేతిలో  మీడియా (ఫోన్)  ఉంది కదా అని   తమకు ఇష్టం వచ్చినట్లు  విషయాలను  వక్రీకరణ చేస్తూ  ఉంటారు.  ఇటువంటి  వారు  నిజానికి  విపరీతమైన మానసికంగా అనారోగ్యం తో  బాధపడుతూ ఉంటారని   మానసిక  వైద్య శాస్త్రం చెబుతోంది.  

మరికొందరైతే   ఇంకొక మెట్టు ఎక్కి బహిరంగంగా కాస్త ఉన్మాద  చర్యలతో  ప్రవర్తిస్తూ  ఆనందిస్తూ ఉంటారు.  ఇలా  భయబ్రాంతులకు సృష్టిస్తే , అందరూ భయపడి గౌరవం ఇస్తారు అనుకుంటారు.  ఇది కూడా మానసిక స్థితి బాగోలేని కారణం గా  ఇలా తాము చేస్తారని వారికి తెలియదు.   వాస్తవానికి  ఇటువంటి వారు సహజంగా మంచివారు.  కానీ జీవితం లో అనుకున్నది  మంచి తో  సజావుగా,  సాధించలేక పోవడం వలన  ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఇలా సమాజం లో   రజో తమో గుణాలతో ప్రవర్తించడం వలన , తాము అందరికీ  చులకన అవుతాం అని  భావించలేరు.  ఇది తమ వ్యక్తిత్వాన్ని తాము  నిగ్రహించు కోలేని  బలహీనత అని తెలుసుకోలేరు. 

స్త్రీ, పురుష అనే  భేేదం లేకుండా ప్రతీ చోటా  బంధు  మిత్ర సముదాయం లో ఇటువంటి వారు కొందరు మాత్రం ఉంటారు.  

ఇటువంటి వారి మానసిక స్థితిలో మంచి మార్పు కోసం , ప్రతి ఒక్కరూ భగవంతుని కోరుకుంటూ మంచి సంకల్పం చెయ్యాలి.  అందరికీ వీరిపై శుభదృష్టి ఉండాలి. 

🍀🍀🍀🍀🍀🍀🍀

ఇంకా మరికొందరి,  మానసిక  స్థితి ఎలా ఉంటుంది అంటే, రాజ్యమే లేని చోట  ఒక  రాజ్యాధికారం కోసం పడే తపన,   శిలాఫలకాలపై  పేరు కోసం పడే తపన , ఎన్నో  కుటిల  యత్నాలకు దారి తీస్తుంది.  వీరి ఆలోచనలలో  అజ్ఞానం,  డొల్ల తనం నెమ్మదిగా కాలం గడిచేకొద్దీ  బయట పడుతుంది. 

సమాజం లో  ఎప్పుడైనా ఎవరైనా  ఎక్కడైనా  ఒక మంచి  బృహత్తర కార్యక్రమం చెయ్యాలి   అంటే  సహృదయంతో  అందరిని కలుపుకుని వెళ్లాలి. మంచి  ఆలోచనా పరులతో  చర్చించాలి.  ఈ మాత్రం కనీస  జ్ఞానం ఉండాలి.  లేకపోతే   ఉత్తమమైన కార్యక్రమం  అని అనుకొని  తలపెట్టే , ఏ పని అయినా  వృధా అయ్యే  అవకాశం ఉంటుంది. 

ఈ కలికాలంలో  మాయ కు  ఉండే ఆకర్షణ వలన , మాయకు వశం అయి,  కొందరు మాయ జీవులు చెప్పే మాటలకు  అనేక మంది  ఆకర్షితులై   వేల కొలది విరాళాలు, చందాలు సమర్పించిన  ఎందరో  తెలివైన  మిత్రులు కూడా చివరకు అమాయకులు గా  మిగులు తారు.   మాయ జీవుల యొక్క  వికారి బుద్ధి  ,    నెమ్మదిగా  తెలుసుకొని  లబోదిబో అంటారు.  కానీ నోరు  మెదపలేరు.  ఎందుకంటే తాము మాయ వలలో పడి  ఎంత బుద్ది తక్కువ పని చేశామో అని లోలోపల బాధ పడతారు. తమ బాధ ఎవరికైనా చెపితే చులకన అవుతాం అని భావిస్తూ, మౌనంగా ఉంటారు.... 

ఈ దశలో  మాయ  మాత్రం తన వికారి బుద్ధి తో  మనుషుల పై  విజయం సాధించాను అని సంబరపడుతుంది.  ఎందుకంటే మాయ ఎప్పుడూ మోసం చెయ్యడమే విజయం గా భావిస్తుంది. ఇది మాయా లోకం. 


మిత్రులారా! ఒకటి ఆలోచించండి. చిన్న తనం లో ప్రతీ స్కూల్ లో  తెలుగు టీచర్ చెప్పిన విషయం . "కుటిల యుక్తి కి మంచి శక్తి ఎప్పుడూ తోడు రాదు". అని 

ఒక  నెగెటివ్ ఎనర్జీ తో  ఆరంభించే   ఏ కార్యక్రమాలు కూడా సఫలం  అయిన దాఖలాలు లేవు. పైగా బూడిద లో పోసిన పన్నీరు వలే  ధనం వృధా అవుతుంది. దాని బదులు అనాధ పిల్లలు కు అన్నం పెట్టి,  బట్టలు ఇస్తే   పుణ్యం వస్తుంది.

పేరు, కీర్తి  కోసం కాకుండా, సేవా దృక్పథంతో  చేసే కార్యాలకు  పరమాత్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

ఒకసారి కళ్లు మూసుకుని ఆలోచించండి ఈ విధమైన  మాయా  స్థితి  ప్రవర్తన లతో ,  ప్రతి మనిషి చుట్టూ ఎందరు ఉన్నారో .

🍀🍀🍀🍀🍀🍀🍀

మరొక  విషయం  ఏమిటంటే,  స్నేహితులు  అనబడే కొందరు , బహిరంగంగా తమకు గిట్టని వారిపై ఓర్వలేక    చేస్తున్న అకృత్యాలను  ఆగడాలను  అరికట్టడానికి,  ఖండించ డానికి ,  ఇది తప్పు ,  ఇలా చేయకూడదు  అనే  కనీస  జ్ఞానం చెప్పడానికి  మిగిలిన  మిత్రులెవరు   కూడా  చాలా సందర్భాల్లో ముందుకు రారు.  సరికదా  మౌనం గా   ఉంటారు.  ఎందుకంటే భయం.  ఈ  సమస్య నాది కాదు కదా ,  ఏమో వాళ్లకు వాళ్లు కు  మధ్య  ఏం గొడవలు ఉన్నాయో,   ధైర్యంగా  నిలదీస్తే  నా మీద  ఏ నిందలు ప్రచారం చేస్తారో   అని అనుకుంటారు.  నేను  ఇందులో  involve  అయితే  చెడ్డ అవుతాను అనుకుంటారు ....  

బహిరంగంగా ఒక హత్య జరుగుతున్నప్పుడు, ఆపడం పోయి .... హత్య ఎలా జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తే , రేపు అదే  పరిస్థితి   ఎవరి కైనా  రావచ్చు.

 

తోటి వారిని కించపరుస్తూ  ఇబ్బంది పెట్టే  వారిని వదిలెయ్యడం మంచిది కాదు.  ఉత్తములైన వారు, ఇటువంటి వారి సమస్య ఏంటో తెలుసుకుని, వారి మానసిక స్థితికి  అర్దం అయ్యే రీతిలో మంచి  ఏంటో  చెప్పి, మంచి ప్రవర్తన తో  సహృదయులు గా  మార్చ వలసిన అవసరం ఎంతైనా ఉంది ... అలాకాదు  అనుకుంటే  స్నేహం అనే పదానికి అర్థం ఏమిటి. 


మంచి అనుకునే మనిషి  చెడు గాను  మారవచ్చు. చెడు  అనుకునే మనిషి  మంచి గాను మారవచ్చు.

మనిషి ,  ఒక మంచి పని  చేసి జీవితాంతం గుర్తించు కుంటాడు.  సంబరపడతాడు ....  కానీ  అంతకు మించి పది రెట్లు చేసిన చెడు పనులను ,  మసి పూసిన మారేడు కాయ లాగ  మరచి పోతాడు. ఇది మానవ నైజం.  ఆత్మ విమర్శ తో  తన చెడును తెలుసు కొని, మారితే అదే ఆ మనిషి కి మోక్షం.


ప్రతి మనిషి జీవితంలో తప్పులు చేస్తాడు. నిజానికి తప్పులు చేయడం  తప్పు  కానే కాదు. మానవ సహజం.... కానీ  చేసిన తప్పులు  సరిదిద్ధుకోక పోవడం  అసలు సిసలైన తప్పు, సమర్థించుకుంటూ  మరో  పది తప్పులు చేయడం మహా పాపం .... కాదనగలరా.


మనిషి  లో  చెడు తలంపులు  నిండినపుడు,  వ్యక్తిత్వం  సరిదిద్ధుకోవడం వలన ప్రవర్తన మారుతుంది.  ప్రవర్తన వలన పరిణితి వస్తుంది. పరిణితి వలన పరిపక్వత వస్తుంది. మనసు తేలిక అవుతుంది .... కానీ ఏ మార్పు రాకపోతే నే  జీవితం ఊహించని  శిక్షార్హం గా  క్రమేపీ అవుతుంది.  దీనికి ఎవరు బాధ్యులు కారు.

అహంకారం అనేది పరోపకార సేవ అయితే  అదే స్వర్గం.  అదే  అహంకారం కోపమో, మోసం గాని అయితే అదే నరకం. 

ఈ హిత బోధలు, ప్రవచనాలు, మాకు తెలుసు లే ... " సిన్నప్పట్నించి  సూత్తన్నాం,  యింటన్నాం" ... అనే వ్యంగ ధోరణి తో  నేటికీ  ఎవరైనా ఉంటూ ఆలోచిస్తే,   వారికి   పరమాత్ముడు  కూడా ఏ సహాయం చేయలేడు . రాబోయే రోజుల్లో  ఇటువంటి వారి జీవిత  ఫలితాలు కూడా  వారి  వ్యంగమైన మాట తీరు లాగే ఉంటాయి. ఇవి నగ్న సత్యాలు. వాస్తవాలు.  అర్దం చేసుకోవాలి.

కొందరు స్నేహితులు ,  వాస్తవ విషయాలు,  సూక్ష్మం గా,   పూర్తిగా,  నిజాయితీ గా తెలుసుకోకుండా,  ఎక్కడో  దూరంగా  ఉంటూ , తెలిసి తెలియని తనంతో  తమకు తోచిన విధంగా  మాట్లాడడం అనేది వారి విజ్ఞత  , గౌరవం  కోల్పోయే  లా చేస్తుంది. 

🍀🍀🍀🍀🍀🍀🍀

నేటి కాలంలో ... స్నేహం అనే జీవన ప్రయాణం లో  మిత్రులు మిత్రురాళ్లు  ప్రతీ చోటా తప్పకుండా కలిసి ఉంటారు.  స్త్రీ పురుష లింగ  భేదం అనేది చూడకుండా ఎవరైనా  సహృదయంతో , ప్రేమతో  ఇంటికి ఆహ్వానించి నపుడు కలిసి లేదా విడి విడిగా వెళ్లే వారు ఉంటారు , ఆ మాటకు వస్తే నేడు ఇలా ఎందరు లేరు,  ఆలోచించండి ... కానీ అది చూసి  అపార్థం గా  మాట్లాడే  వారి మనసు లో  కామం అనే  వికారం  పుష్కలంగా  ఉంటుంది. అదే  కామ  తలంపు లో  ఉండే  వారికి  దృష్టి(చూపు)  కోణం చాలా వక్రం గా (వంకర)  ఉంటుంది .... ఈ విధమైన వ్యర్థ విషయాలను  ఆసక్తి గా   వినే వారి లో  కూడా  స్థిత ప్రజ్ఞత  ఉండదు.    ఇటువంటి వారికి,   ఒక తల్లి కి జన్మించిన  అన్నా చెల్లి  కూడా  నడిరోడ్డుపై  వెళ్తుంటే ,  తేడా గానే  కనిపిస్తారు.  ఎందుకంటే  అది వారి  సంస్కారం .. ఎవరైనా  కాదనగలరా ... ఒకసారి ఆలోచించండి.

ప్రతీ ఒక్కరి కి   తల్లి, భార్య, కూతురు, సోదరీ  అనే స్త్రీ మూర్తులు ఉన్నారు.  అని బుద్ధి లో  గమనించు కోవాలి. 

"ఆడవారి కి ఆడవారు శత్రువు"  కాకూడదు. అలా ఉంటే  చదువు , జ్ఞానానికి అర్దం ఏముంది.

 

ఎవరైనా  సంస్కార హీనత  లేని వారు,    తమ నీచమైన మాట తీరు తో  వ్యర్థమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు  లేదా  ప్రచారం  చేసేటప్పుడు  వారి వ్యక్తిత్వం మరియు మానసిక స్థితి ఎలాంటిదో  ఒకసారి ఆలోచించండి. 

గాసిప్స్ (ఆధారం లేని పుకార్లు, లేదా  నిజాలను వక్రీకరించి న   విషయాలు)  ఎదుటి వారి గురించి  వింటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నపుడు    చాలా మంది కి   మనసు లో   ఉత్సుహత ,  చాలా  ఆనందం గా,   ఆకలి తీరుతున్నట్లు  99 శాతం మంది కి  ఉంటుంది .... రేపు అవే గాసిప్స్  నా గురించి వస్తే,  నా గురించి ఎవరైనా ప్రచారం చేస్తే,  నా పరిస్థితి ఏంటి ,  నా కుటుంబ పరిస్థితి ఏంటి? .. అని ఏనాడైనా  ఎవరైనా ఆలోచించారా.  (మానసిక స్థితి  సరి లేని వారు ఎక్కడో ఉండరు.  మనుషుల మధ్య నే ఉంటారు) .... చెడు కర్మ లలో,  ఏ రకం గా  ఎవరు భాగస్వామ్యం అయినా, ఫలితం ఏదో రూపంలో తిరిగి వస్తుంది.... ఇది నిజం.

పనికట్టుకుని  చెడు ను  ప్రచారం చేసే  వారు ,  కనీసం,  ఏదో  శివనామస్మరణ ను  లేదా  అల్లా, జీసస్ నో   ప్రచారం చేసి ఉంటే ,   గత జన్మలలో  చేసిన పాపాలు  తొలగి,  నేటి జన్మలో  మంచి బుద్ధి తో ,   ఫలాలు ఇచ్చే  పచ్చటి చెట్టు లా  శ్రేష్టమైన  జన్మ పొంది,  కొందరి లా  ఉత్తమమైన  సుఖ భోగాలు  లభించేవి.  అలాగే  ఆ  దైవ నామం  వినే వారికి  కూడా పుణ్య ఫలం దక్కేది. 


ఒకరి  జీవితం లో  ఆసక్తి గా ఏం జరుగుతుందో అని  తొంగి  చూస్తే  ... మన జీవితం లో కి  వెయ్యి మంది తొంగి చూస్తారు.   సిద్ధం గా ఉండాలి.


మనిషి  చేసే ప్రతి కర్మ  రికార్డ్ అవ్వవలసిన చోట అవుతూనే ఉంటుంది. ఎవరు ఏం చేసినా ఎవరూ చూడడం లేదని అనుకుంటే అంత పిచ్చితనం మరొకటి ఉండదు.  


దైవత్వాన్ని అంకిత భావంతో జీవితం లో ఒక భాగం గా చేసుకున్న వారే చివరి దశలో మంచి మరణం పొందుతారు.

ఓం నమఃశివాయ 🙏

అల్లా జీసస్.

🍀🍀🍀🍀🍀🍀🍀

బాల్యం లో చదువుకున్న  ఆ మంచి పాఠశాల పేరు,  క్రమశిక్షణ,  మాష్టార్లు  నేర్పించిన  మంచి, మర్యాద, సంస్కారాలు,  విలువలు,  ప్రేమలు, అభిమానాలను మరచి పోయి ,  తల్లి తండ్రుల ద్వారా నేర్చుకున్న సంస్కారాలను గాలి లో వదిలి,  నటిస్తూ  గుడ్డిగా   జీవించడం  కొందరికి  అలవాటు అయిపోయింది.... కాదనగలరా.

బాల్యం లో కాదు,  నేడు  50 సంవత్సరాలు దాటిన తరువాత కూడా,  కొందరికి మాత్రం ఆ చింత కర్రతో  తొక్క తీసిన  స్కూల్  మాష్టారు ... పేక బెత్తం తో  చర్మం  ఒలిచిన  స్కూల్  హెడ్ మాస్టర్ గారు ఎంతైనా  నేడు  అవసరం.


స్నేహం అనే  గొప్ప  పేరుతో  మనం  జీవితంలో  ఉన్నతమైన  సంబంధాలతో   వృద్ధి చెందుతూ ఉన్నామా?  లేక  దిగజారుతున్నామా?   మనం ఎక్కడ ఉన్నాం , అని మనం మనసు లోకి తొంగి  నిజాయితీగా చూసుకుంటే ... నవ్వాలో  ఏడవాలో సిగ్గు పడాలో  తెలియని  వింత  స్థితి  కనిపిస్తుంది.


🎈🎊🎈🎊🎈🎊🎈🎊


అదే విధంగా   కొందరు మిత్రులు,  మిత్రురాళ్లు  లింగ భేదానికి  అతీతంగా,   స్నేహాన్ని  గౌరవంగా  చూసుకుంటూ , ఒకరికొకరు  కుటుంబ సభ్యుల తో   స్నేహ బంధుత్వం కలుపుకుని,  పరిణితి తో  ఆదర్శం గా  భవిష్యత్తు తరాలకు,  పిల్లలకు మంచి స్నేహం విలువను అర్దం చేస్తూ,  ఇంత వయసు వచ్చిన,  మా బాల్య స్నేహం చూడండి ఎంత గొప్పదో అని సంతోషంగా,   నిజాయితీగా ,  మనస్సాక్షిి  తో  తమ పిల్లలకు  చెప్పుకొనే  వారు కూడా  అనేక  మంది  ఉంటారు ... ఉన్నారు.  ఇది ఒక ఆరోగ్యకరమైన స్నేహం, మర్యాద పూర్వక  స్నేహం,  మంచి మానవ సంబంధాలను సమాజానికి,  తరువాత తరాలకు ఇవ్వగలిగేది  స్నేహం.  

ఎందుకంటే  పెద్ద వారు  ఎలా ఉంటే వారి పిల్లలు కూడా అలానే ఉంటారు.  

అదే విధంగా ఎందరో ఉత్తముులైన కొందరు మిత్రులు , విదేశాల్లో ఉన్న వారు కూడా  ఏ పేరు, కీర్తి  ఆశించకుండా,  రెండో చేతికి తెలియకుండా  కష్టాల లో ఉన్న తోటి మిత్రులను,  తమ సహృదయంతో  ఆర్థికంగా  ఆదుకున్న వారు  ఉంటున్నారు. ఇదే కదా ,  అసలు కావలసింది. 

అంటే,  మిత్రులందరూ ఆర్థికంగా చేయూత నివ్వలేని వారు....  మనసా సేవ, వచసా సేవ తో కష్టం లో ఉన్న వారికి స్ఫూర్తి , ధైర్యం నింపేవారు కూడా చాలా మంది ఉన్నారు .  ఎందుకంటే  అన్నీ ఉన్నా మనోధైర్యం లేక ఆందోళనలతో జీవితం గడిపే స్నేహితులకు ఇది అవసరం.  ఇటువంటి వారికి చేయూత నివ్వడం కూడా మామూలు విషయం కాదు. 


50 సంవత్సరాల వయసు దాటినా  కూడా నేడు  కొందరికి  వివాహం కాని వారు ఉండొచ్చు,  కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేని వారు ఉండొచ్చు,  కొందరికి భార్య లేదా భర్త  లేదా  పిల్లలు కోల్పోయిన వారు ఉండొచ్చు.  ఆర్థికంగా  నష్టపోయిన వారు ఉండొచ్చు. కొందరికి చెప్పలేని అనారోగ్యాలు తో  ఉండొచ్చు.  కదిలిస్తే  ప్రతి ఒక్కరిలో ఎన్నో జీవిత విషాదాలు ఉంటాయి .  ఇటువంటి వారిని  కాస్త ప్రేమగా  పలకరించ గలిగేది ఎవరు? ... ఒక మంచి  స్నేహితుడు/ స్నేహితురాలు. ఎవరైనా ఇది కాదని అనగలరా ?.


🍀🍀🍀🍀🍀🍀🍀

ఇప్పటికే గత జన్మలలో గాని, నేటి జన్మలో గాని చేసిన చెడు కర్మల ఫలితం వలన,  ఏదొక సమస్యలతో  నేడు జీవితం సరిగా లేక  కొందరు , వికారాలకు బానిసలై కొందరు, ఒక  శాపగ్రస్తం తో కొందరు  , సుఖం శాంతి లేక  ఈర్ష్య, అసూయ, ద్వేషం, క్రోధం, మోహం, లోభం, కామం, వంటి వికారాల ముళ్ల కి  బానిసలు గా  జీవితం గడిపే స్థితి లో  ఎందరో ఉన్నారు.

ఒకటి ఆలోచించండి ... మంచి ఆరోగ్యం కోసం, నోటికి ఆహారాన్ని పరిశుభ్రం చేసి తింటున్నాం గాని కుళ్లిన ఆహారం తినడం లేదు కదా ....  మరి 50 సంవత్సరాలు దాటిన సరే,   కొందరికి  నోటితో మాట్లాడే  మాటలు ఎందుకు శుద్ధి గా ఉండడం లేదో ,    ఆలోచించు కోవాలి.   అశుద్ధపు మాటలు నోటిలో నుంచి వస్తున్నాయి అంటే, ఆ శరీరం మరియు  మనసు లో విషతుల్యమైన మలినాలు పేరుకు పోయి ఉన్నాయని అర్దం.  ఇలా అయితే చిన్న వయసు లోనే  చాలా ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడతారు.  తద్వారా,  వారి కుటుంబం, పిల్లలు  ఇబ్బందులు పడతారు ...  కదా, ఇదంతా అవసరమా.... ఒకసారి ఆలోచించండి.

 

ముళ్ల వంటి వికారాల స్వభావం కలిగిన వారు తమ ముళ్లను ఆయుధాలు గా భావించి  గుచ్చుతూ ఉంటే,  ఏదోక రోజు  బలమైనది వచ్చి ముళ్లకు  తాకుతుంది.  ఆ ముళ్లు అర్ధాంతరంగా శాశ్వతంగా  నాశనం అవుతాయి,  కనుమరుగు అయిపోతారు .... కానీ ఇది కాదు కదా,  జీవిత పరమార్ధం.  ఆ ముళ్లు  పరివర్తన, మార్పు చెంది  గులాబీ పువ్వు లా  మారితే నే  జీవితం పరిమళభరితమై,  జన్మకు సార్థకత ఉంటుంది .... అర్దం చేసుకుంటే ఇందులో మంచి ఏంటో తెలుస్తుంది.  


ఒక వైపు  ప్రతి రోజూ ఇష్ట దైవాన్ని  ప్రార్ధిస్తూ  పూజలు చేస్తూ ,  మరో వైపు అకృత్యాలు , మానసిక  దౌర్జన్యాలు  చేస్తుంటే  మనిషి మనసు లో మలినాలు ఎలా తొలుగుతాయి. శుభ ఫలితాలు ఎలా వస్తాయి.  ఇది చాలా ప్రమాదకరం,  దీనినే  మనిషి తన గొయ్యి తానే స్వయంగా తవ్వుకోవడం అంటారు.


• ప్రతీ మిత్రుడు/మిత్రురాలి  లో  మంచి  చెడు .... బలం  బలహీనతలు  ఉంటాయి.  ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి.   మంచి మార్పు తెచ్చుకోవడానికి, సరిదిద్ది కోవడానికి  ఇక  జీవించి ఉండే  సమయం  కొంచెం మాత్రమే మిగిలి ఉంది. ఆలోచించండి.  ఎవరైనా,   నేను మారాను. నాలో మార్పు వచ్చింది,  నేను చేసిన తప్పుడు  పనులకు  క్షమాపణలు కోరుకుంటున్నాను  అని నలుగురికి చెప్పుకోవడం  లేదా  దేవుని ఎదుట క్షమించమని అడగడం,  అత్యంత గొప్ప విషయం.  ఇందులో సిగ్గు పడవలసిన విషయం ఏ మాత్రం లేదు.  చేసిన వికర్మలు తొలగించుకోవడానికి  ఇదే మొదటి  పరిష్కారం. ఇలా మారడం వలన నలుగురి కి ఆదర్శం అవుతారు..... వాల్మీకి వేటగాడు, పక్షులను చంపాడు ... మారడం వలన దైవాంశ సంభూతుడు అయ్యాడు.

మనుషులను దూషించడం, విమర్శించడం, మనసు బాధపెట్టే ఛలోక్తులు విసరడం ఏనాటికీ,  ఎవరికి  గొప్ప తనం కాదు... కాబోదు. ఎవరి పట్ల అయినా,  సరిదిద్దు  కోలేని  తప్పులు చేసినా సరే .... నేను తప్పు చేశాను, క్షమించమని అడిగితే ఎటువంటి వారైనా అర్దం చేసుకుంటారు.  అది వ్యక్తి శ్రేయస్సు కి మంచిది.

ప్రతి ఒక్కరిని ప్రేమించండి.  ప్రేమ అంటే కామం కాదు …. మానవత్వం.  ఇబ్బంది, కష్టం  ఉంటే  మంచి గా  చెప్పుకుంటే , ప్రతీ ఒక్కరూ సహృదయంతో  అక్కున చేర్చుకుంటారు.  


ఏ  మనిషి   మనసులో  నైనా   స్థానం సంపాదించాలి,  అంటే   నిజాయితీ  గల ప్రేమ  అవసరం.   నేను నటించకుండా  సహృదయంతో,  నా తోటి వారి ని  ఎందరిని   ప్రేమిస్తున్నాను అని  మనసు లో ఆలోచించి  చూడండి. 

 

పగ, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలతో   ప్రవర్తిస్తే  సాధించేది  ఏమీ ఉండదు చివరికి  బూడిద  తప్ప .... ఈ పాటికే  ఇదంతా అర్దం అయి ఉంటుంది.  ఇవి సినిమా డైలాగులు కావు, ... మనస్సాక్షి ని అడిగితే  మనసే సమాధానం ఇస్తుంది. 

 

ఇదంతా సూక్ష్మం తో గ్రహించ వలసిన విషయం.  ఒకరి బుద్ధి, ఏ కోణంలో ఆలోచిస్తూ పని చేస్తుందో వారికి మిగిలిన వారు తమ లాగే కనిపిస్తారు. 


ఒకటి మాత్రం నిజం  ఈ లోకంలో  ఎవరి కర్మకు వారే బాధ్యులు.  ఒక  మనిషి  తన లో ఉన్న మానసిక,  వికారాలను, దేహ వికార  చాపల్యాలను ,  తన తోటి వారికి ఆపాదిస్తూ,  కొందరి  దుఃఖానికి కారణం అవుతూ ఉంటే కనుక ,  ఆ దుఃఖం అనుభవించే  వారి  కర్మను  తీసుకుని  నెత్తిన వేసుకోవడమే.  అంటే నేలను పోయేది నెత్తిన రుద్ధుకోవడం అంటారు కదా అది.  దీనంత  దౌర్భాగ్యం , దారిద్ర్యం మరొకటి లేదు.

ఎవరైతే  తోటి వారిని  మాటలతో  కించపరుస్తూ, ఉంటారో  వారి  కుటుంబ శ్రేయస్సు కి, వారి పిల్లల పురోగతికి  వారే అవరోధం గా  మారుతారు.  ఇది శాస్త్రాలలో రాయబడి ఉంది. ఇది నిజం. 

అందుకే ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు... ఇవ్వకండి. ఎవరు పాపం చేసినా ఏదోక రూపం లో వడ్డీ తో సహ అనుభవించ వలసిందే . ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు .... కర్మ సిద్ధాంతం చెప్పేది ఇదే.

కమ్యూనికేషన్ మీడియం ఉపయోగించుకొని నలుగురిని చెడ్డ గా చిత్రీకరించడం అనేది మంచి సంస్కారం కాదు.

ప్రతి మనిషి   ఇతరులలో లోపాలు  చక్కగా వెతుకుతారు.   మరి తమ లోని లోపాలను ఎందుకో గుర్తించలేరు. ఎవరికి వారు తమ లోపాలను గుర్తించి సరి చేసుకుంటే,  అసలు ఎవరికి ఎవరితో సమస్య అనేది ఉండదు కదా … ఆలోచించండి.

పోని లోపాలను సరిచేసే వారిని, ఎందుకని స్వాగతించ లేరు? ... అహంకారమా ?. అలా అయితే నష్టం జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఎవరికి ? .... ఒకసారి ఆలోచించండి.   

ఇకనైనా  వ్యక్తి గత  అవసరాలు, స్వార్థం కోసం  స్నేహాన్ని ,  స్నేహితులని  వంచించకండి.  ఎదురుగా అందరిలో చెప్పేది ఒకటి,  వెనుక చేసేది మరొకటి అనే విధానానికి స్వస్తి చెప్పండి ..... ప్రతీ సమస్య పరిష్కారానికి   ఒక పద్ధతి,  తీరు, తెన్నూ  ఉంటాయని గ్రహించండి.  ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తాం అని అనుకుంటే  .... నేటికీ  లాభం  పొందారా?  పొందుతున్నారా?    అనేది  ఆలోచించండి ...


మిత్రమా! నీ లోని మానసిక వైకల్యం ఒక  వైఫల్యం. ఇది అంగవైకల్యం కంటే ప్రమాదకరం.  ఈ విషయం  నిజాయితీ తో  నువ్వు  అంగీకరించకుండా,  నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ,  నువ్వు బాధ పెట్టిన వారు  తాత్కాలికంగా  మాత్రమే బాధ పడతారు. కానీ  నీ లో   చివరికి  జీవితాంతం  మిగిలేది  అంతులేని  దుఃఖం , క్షోభ .... .

• ఓ మిత్రమా!…. నిజాయితీగా  ఆత్మ విమర్శ  చేసుకొని,  చేసిన  వికర్మలు(పాపాలు)  కరిగించు  కున్నప్పడు  స్వర్గ లోకపు అంచులు తాక గలవు.


• ఏ స్నేహితుడు  తోటి  వారికి,  సాటి వారికి ఉపయోగపడక పోయినా  అణువంత నష్టం లేదు. కానీ  ఇతరులకు మాటలతో, చేతలతో  బాధను కలిగిస్తే  జన్మ జన్మల దుఃఖం అనుభవించడానికి సిద్దం అయినట్లే . కర్మ సిద్ధాంతం ఇదే చెబుతుంది.  ఎవరికి ఏది ఇస్తామో అదే తిరిగి  రెట్టింపు గా వస్తుంది.


•  ఓ స్నేహితుడా !   

నీ లో  దాగి  ఉన్న  మంచి,  సంతోషాలు,  సరదాలు,  ఆనందాలతో పాటు ... 

నీ వికారాలు,  నీ  అవలక్షణాలు,  నీ సమస్యలు,  నీ వ్యసనాలు , నీ అనారోగ్యాలు,   నీ వ్యక్తిత్వ లోపాలు , నీ చపల బుద్ది   బయటకు  తెలుస్తూ ఉన్నా  సరే ,    నీ  తోటి మిత్రుడు(లు)  ఓర్పు తో  భరిస్తూ,  నిన్ను  ఆదరిస్తున్నారంటే  అదే  స్నేహం.  మరియు  స్నేహం లోని   ప్రేమకు  ఇచ్చే విలువ, గౌరవం .... అంతేగానీ  నిన్ను  భరిస్తున్న  ఆ మిత్రుడి (ల) యొక్క బలహీనత కాదని తెలుసుకో!  లేదా  కాలక్షేపం కోసం అసలే కాదని తెలుసుకో!.    ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ  బాధ్యతలతో  నిండిన  బరువులు తమ తమ పరిస్థితులను బట్టి ఉన్నాయి.


ప్రతీ మనిషి ఒక మంచి స్నేహితుడుగా జీవితకాలం ఎవరికోసం అయినా నిలబడాలి అంటే  ఈ మాత్రం ఆత్మ విమర్శ  తప్పని సరిగా చేసుకోవాలి.... ఇది రాస్తున్న వాడితో సహా.... ఎందుకంటే ఈ విషయం లో ఎవరికి మినహాయింపు లేదు. 

ఎవరు ఏ పని చేసినా జీవితం లో చివరికి  భగవంతుడికి సమాధానం చెప్పి తీరాలి.  తప్పుడు పనులు చేసి  తప్పించుకుంటూ  తోటి మనుషులను మాయ చెయ్యొచ్చు,  కాని  పరమాత్మ ని  మాయ చేసే వారు  సృష్టి లో ఇంకా పుట్టలేదు .... పుట్టబోరు.  జాగ్రత్తగా ఉండాలి.


మంచి పనులు నిజాయితీ తో  సహృదయంతో చేస్తే ఆశించ కుండానే  పేరు, కీర్తి , గుర్తింపు వస్తుంది.  ధర్మం గా  బ్రతకాలి ..... అంతే కాని,  పేరు , కీర్తి,  ప్రతిష్ట కోసం  ప్రాకులాడకూడదు.  అవి వెంపర్లాడితే దొరికేవి కావు.  అవి డబ్బు , హోదా ఉన్నంత  మాత్రాన దొరికేవి కావు. ముఖ్యంగా  అవి కావాలి అంటే  అందరికీ లభించవు.  అవి పరమాత్ముడు అర్హత కలిగిన వారికి ఇస్తాడు.


స్నేహం అంటూ ఆర్బాటంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ,  వినోదాలు సంబరాలు జరుపుకునే  ప్రతి  సమయం లో,  గతంలో  మనం ఎవరికైనా  సంతోషం ఇచ్చామా  లేదా దుఃఖం ఇచ్చామా  అనేది  మన  మనస్సాక్షి కి  తప్పకుండా సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉంది.  అవసరమైతే క్షమించమని అడగడం లో   గౌరవం పెరుగుతుంది.   

ప్రతి  స్నేహితుడు మరియు స్నేహితురాలు  మిత్రులతో  మెలిగే టపుడు  తమ వ్యక్తిత్వం,  మానసిక  స్థితి , తమ అంతరంగం లో  ఎలా  ఉందో  గమనించు కోవలసిన అవసరం ఉంది.  ఇదంతా ఒక మంచి కోసం, ఆరోగ్య కరమైన  వాతావరణం  కోసం. 

తోటి వారితో   వయసు కి  తగిన  మంచి ప్రవర్తన,  మాట్లాడే  భాష,  ఆలోచన  ప్రతి ఒక్కరి  మనసు లో మంచిగా ఉందా  లేక  కేవలం  వారితో  ఎదురుగా ఉన్న సమయంలో నటిస్తూ వారు వెళ్లాక  వారిని  వెనుక   అసభ్య పదజాలంతో   వ్యంగ్యం గా  ఉన్నామా .... అని తప్పని సరి  ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ భయంకరమైన పాపాలు గా తిరిగి చుట్టుకొని రాబోయే కాలంలో  మనశ్శాంతి లేకుండా చేస్తాయి.


మనుషులు  అందరూ మంచివారు .... కాని బలహీన పరిస్థితులు వలన అవలక్షణాలకు  దాసోహం అయి,  వారిని చెడ్డవి గా  తయారు చేస్తాయి... చెడ్డగా చూపిస్తాయి.  మార్చుకో గలిగితే వారంత మంచివారు  ఎవరూ ఉండరు. ఒక తప్పు చేసి కప్పి వేయాలి అనుకుంటే పది తప్పులు చేయవలసి వస్తుంది. ఇది దిగజారుడు స్థితి కి  ఆహ్వానం.


బాల్యం లో మనతో ఉన్న తల్లి తండ్రులు చాలా మందికి నేడు లేరు .... ఇంకా  కొన్ని విషయాలు నేడు చెప్పడానికి.

బాల్యం లో ఉన్న మంచి ఉపాధ్యాయులు , గురువులు చాలా మంది  లేరు .... ఇంకా మంచి విషయాలు నేడు చెప్పడానికి.

ఇది వరకు మనతోనే ఉండి , నిత్యం మంచి మార్గం గురించి  చెప్పే  ఉత్తములైన  పెద్దలు ప్రతీ చోటా ఉండేవారు.  నేడు ఆ పరిస్థితి లేక  పైగా విపరీతమైన  స్వేచ్ఛ ఉండడం వలన  ,  మనిషి ఏ మార్గం లో పయనిస్తున్నాడో  మనిషి కే తెలియడం లేదు .... ఇలా ఉంటే రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి ..... ధనం కంటే విలువైనవి సృష్టిలో చాలా ఉన్నాయి.  అవే మనిషి కి  నిజమైన మార్గదర్శకాలు.


లోక కళ్యాణం జరగాలి  అనే ప్రతీ  ప్రదేశం లో   పరమాత్ముని  అంశం తో కూడిన శక్తి  ఏదోక రూపం లో  తప్పకుండా  ఉంటుంది.... ఈ శక్తి కంటికి కనిపించినా, కనిపించక పోయినా సరే.


అహంకారం విడిచినపుడు ఆత్మ లో వెలుగు కనిపిస్తుంది.

వికారాలను విడిచినపుడు ఆత్మ లో చైతన్యం పెరుగుతుంది. శరీరం లో శుద్ధి జరుగుతుంది.

మంచి మార్పు కోసం ... 

మంచి అవగాహన కోసం 

స్నేహితులు అనబడే వారందరి మంచి కోసం ....  

ఈ రచన అంకితం.


జీవితం అంటే    గెలుపు ఓటమి ల  ప్రయాణం కాదు .....  నిరంతరం  మంచిని  పెంపొందించుకునే  మార్పు  మాత్రమే  జీవితం.  

ఎందుకంటే జీవితం లో  గెలిచినా ఓడినా మనిషి  చివరికి కలిసేది మట్టి లోనే.   కానీ  మంచి మార్పు మరికొన్ని   జన్మలు వరకు  ఆత్మ లో  తోడుగా ఉండి  సంతోషంగా జీవించే  జ్ఞానం ఇస్తుంది. 


చివరి మాట 

ప్రత్యక్షంగా, పరోక్షంగా  స్పృహ లో  ఉంటూ  ఉద్దేశ్యపూర్వకంగా  ఎవరికీ  ఏనాడు అపకారం చేయక పోయినా, ఎవరిని ఒక  మాట  తూలనాడక పోయినా, కేవలం నిజాయితీ గా,  మౌనంగా  ఉన్నందుకు,  స్నేహితులు అందరూ నా వారు  అని అనుకున్నందుకు , అందరూ సమానమే అని అనుకున్నందుకు ........  ఎవరైతే  ప్రత్యేకించి  నన్ను    వక్రీకరించి  నిందలను,  దుఃఖం, బాధ  ఇచ్చిన  మిత్రులకు  మరియు మిత్రురాళ్లుకి  హృదయ పూర్వక  నమస్కారములు,  ధన్య వాదాలు మరియు కృతజ్ఞతలు.   

ఎందుకంటే  మీ లాంటి వారి  ప్రేరణ తో  ఇంత  మంచి మనోవికాస  రచన,  మరియు  ఇలాంటి వి  ఎన్నెన్నో  వ్యక్తిత్వ రచనలు రాయగలిగాను.  నాకు   మీరు    అప్పడు,  ఇప్పుడు  మంచే  చేసారు,  చేస్తున్నారు.   మీరు , మీ కుటుంబ సభ్యులు  అన్ని వేళలా శివుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం తో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మణా నా తండ్రి పరమాత్మ  ఎదుట సంకల్పం  చేసి ప్రార్థిస్తున్నాను.🙏

నా పై  చేసిన  ప్రచారాలను  మంచి అయినా చెడు అయినా  అదృష్టమైన  కర్మ భోగం గా భావించి  శివుని కి  వదిలేశాను .... ఎందుకంటే ఆయనే అన్నింటికీ  ప్రత్యక్ష సాక్షి.   నా కర్మలకు ఎలాంటి  ఫలితం పొందాలి  అనేది   పరమాత్ముడే నిర్ణయం చేస్తాడు.  చెప్పాలంటే నాకు  రోజు రోజుకు మంచే జరుగుతుంది.

నాకు ఇంత మంచి  చేసిన వారికి కొంతైనా మంచి చేయాలి అనిపించి, ఇది రాయడం జరిగింది.  ఎందుకంటే  నా లోని,  నా కే తెలియని  అసాధారణ మైన  ఆధ్యాత్మిక శక్తి ని   మీరే  వెలికి తీసారు.  ఇదేమీ సామాన్యమైన విషయం కాదు.  చెప్పాలంటే  ఇది ప్రస్తుత  కాలానికి  సంబంధించిన అంశం పూర్తిగా కానే కాదు. ఇది ఎవరికీ అర్థం కాదు,  కాకపోవచ్చు.


మరణాన్ని  ప్రేమిస్తూ,  భగవంతుని కనుసైగలో,  నీడలో జీవించే వారికి , ఏది ఎందుకు జరుగుతుందో అర్థం అవుతుంది.  ఎందుకంటే  ఇదంతా  భగవంతుడు రచించిన జగన్నాటకం. పరమాత్మ ను  నిత్యం చూస్తూ జీవించే  ఆత్మలకు  , ఆయన త్రికాల జ్ఞానంతో అన్ని తెలియ చేస్తాడు.   

మౌనం ... కాలం రెండు చాలా చాలా శక్తివంతమైనవి.  సమయం వచ్చినప్పుడే అవి చెప్పాలి అనుకొని అనుకున్నవి చెప్పి వెళ్తాయి.


నేను ఆశించేది ప్రతీ ఒక్కరిలో , ముఖ్యం గా కొందరిలో  మంచి మార్పు.  ఇది నా కోసం కాదు. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు కోసం. 


అవసరమైతే , 2020 జనవరి 19 తరువాత  జరిగిన  ప్రతీ సంఘటన  పైన వాస్తవాలు (సంజాయిషీ కాదు) ..... ఎప్పుడైనా,  ఎక్కడైనా,  ఎవరి ఎదుటైనా  బహిరంగంగా  మాట్లాడేందుకు  పరమాత్ముని  ఆశీస్సుల తో  మనస్సాక్షి తో ,  సిద్ధం గా  ఉన్నాను అని  సవినయంగా  మనవి  చేస్తున్నాను 🙏.


ప్రతీ ఒక్కరూ  తమ  తోటి వారి పట్ల  ఆలోచనలలో , ప్రవర్తన లో   మంచి మార్పు తెచ్చుకొని  సహృదయం తో   జీవించలేక పోతే, మన దగ్గర అన్నీ  ఉన్నా సరే  , రాబోయే  13 సంవత్సరాల కాలంలో  పరిస్థితులు ఎంత  దారుణం గా  మారుతాయో  ఎవరి  ఊహలకు కూడా అందదు.  ఇది నిజం....  ప్రవర్తన  అనేది సరి లేకపోతే  మనిషికి  శాపం గా  మారబోతుంది.  అవసరమైతే ఇది screen shot తీసి ఉంచుకోండి. అర్దం చేసుకో గలిగితే చేసుకోండి, లేకపోతే ఇదంతా  వ్యర్ద విషయం అనుకొని పూర్తిగా వదిలెయ్యండి.... మీకు మీరే బాధ్యులు. 


ఒకవేళ, నా వలన  ఎవరైనా, ఏనాడైనా  దుఃఖం, బాధ పొంది ఉంటే వారందరికీ (మిత్రులు/మిత్రురాళ్లు)  మనస్ఫూర్తిగా క్షమాపణలు 🙏 తెలియచేసు కుంటున్నాను. ... 

ఓం నమఃశివాయ 🙏 అల్లా జీసస్.


అదే విధంగా నాకు సంతోషం  పంచిన  ప్రతీ మిత్రుడు మరియు మిత్రురాలికి  బుణపడి  ఉంటాను.🙏


గమనిస్తే ....  పాజిటివ్ గా   తీసుకో గలిగితే  జీవితం లో  పడే  నిందలు,  అవమానాలు, బాధలు, దుఃఖం  అనేవి  ఎదుగుదలని ఇస్తూ  ఉన్నతమైన స్థితి కి తీసుకు వెళతాయి ....  ప్రతీ ఒక్కరిని.


నిజం లో జీవించండి.  నిజాయితీ ని ఆనందించండి.  


చివరిగా  నాలుగు లైన్లు  ఇది చదవండి బాగుంటుంది 👇

🍀🍀🍀🍀🍀🍀🍀🍀


తెలుసుకో    మిత్రమా    తెలుసుకో

  స్నేహమంటే   స్వార్థం    కాదని    తెలుసుకో.

• ముగిసి  పోతున్న    నీ జీవితానికి

  మూల   ధనమని      తెలుసుకో.


• తెలుసుకో    మిత్రమా   తెలుసుకో

  ప్రేమంటే    కామ వికారం   కాదని  తెలుసుకో.

• పడిలేచే     నీ జీవితానికి

  చేయూత    అని   తెలుసుకో.


• తెలవారిన    నీ    జీవితం 

  తేట  తెల్లం     అవుతుంటే

• మనసు లోని    నీ మాయలు 

  మాటలు గా     వస్తాయి.

  అందరికీ    వికారాలను    ఆపాదిస్తాయి.


• కష్టం లో    కదలి వచ్చేది     స్నేహం.

  నష్టం లో     కలిసి ఉండేది    ప్రేమ.

• కష్టనష్టాల    కడలి లో      కాపలా

   కాసే ది     స్నేహం లో ని      ప్రేమ.


• తెలుసుకో    మిత్రమా   తెలుసుకో.

  స్నేహమంటే    స్వార్థం కాదని    తెలుసుకో.

  ప్రేమంటే      కామ వికారం    కాదని తెలుసుకో.


• ప్రేమ   స్నేహల    మిథునం

  లింగభేద  మెరుగని    ఆలింగనం.

• మిత్ర  బృందాల     బంధనం

  మనో  వికాసానికి    సోపానం.


• ఎదుగుతున్న    నీ వయసు కి

  వన్నె   తెచ్చేది    స్నేహం.

• ఒదుగుతున్న   నీ మనసు కి

  శాంతి   నిచ్చేది    ప్రేమ.


• మలినమైన   బుద్ది  కి  

  మూలం

  నీ  మాటలోని   వ్యంగ్యం.

• అది  మార్చుకుంటే  మరు  జన్మ కైన ధన్యం.


• మిత్రులంటే   పచ్చకామెర్ల    తీరు కాదు

  విలువలంటే    ఒలిచేటి     వలువలు కాదు.


• తెలుసుకో     మిత్రమా     తెలుసుకో

  స్నేహమంటే   స్వార్థం కాదని   తెలుసుకో.

• ముగిసి   పోతున్న    నీ జీవితానికి

  మూలధనమని    తెలుసుకో.


• తెలుసుకో   మిత్రమా   తెలుసుకో

  ప్రేమంటే    కామ వికారం కాదని   తెలుసుకో.

• పడిలేచే    నీ జీవితానికి

  చేయూత  అని తెలుసుకో.


• మానుకో    మిత్రమా    మానుకో

  అతి   తెలివి   తేటలు   మానుకో.

• ఆత్మ    విమర్శ  చేసుకో ...

  విశ్వాసం  పెంచుకో .

  అజ్ఞానం  తొలగించు కో ...

  ఆనందం  పెంచుకో ...  పంచుకో.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ఓం నమఃశివాయ 🙏  అల్లా జీసస్ 

యడ్ల శ్రీనివాసరావు 15 Oct 2022 9:00 pm.

9293926810

ఈ రచన పాతది. కానీ చివరి మాటతో  నేడు  కొంచెం update చేశాను.









1 comment:

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...