Wednesday, October 26, 2022

261. శివుని యోగము

 

శివుని యోగము



• శివుని  మొక్కిన  చేతి కి  మోక్షము

  శివుని పలికిన  నోటి కి  యోగము  సంయోగము


• దేహమును  దాపురించిన  వికారములు

  మమకారములై   వీడలేనపుడు

• శివుని మొక్కిన  చేతి కి  మోక్షము

  శివుని పలికిన  నోటి కి  యోగము  సంయోగము


• అహము నిండిన చిత్తము కు  మిగిలేది ఆవేదన

  శాంతి నిండిన  ఆత్మకు   కలిగేది   సౌభాగ్యము.


• దేహభిమానం తో  చివరికి  మిగిలేది దౌర్భాగ్యము

  దేవాభిమానం తో  చిరకాలం  కలిగేది *ధవళము.


• శివుని  మొక్కిన  చేతి కి  మోక్షము

  శివుని పలికిన  నోటి కి  యోగము సంయోగము


• నరుని నటన లో   మిగిలేది  యాతన

 *హరుని స్మరణ తో  కలిగేది *సాధన

  గురుని బాటలో   దొరికేది  చైతన్యం

  యముని చెంతన  జరిగేది  ప్రక్షాళనం


• శివుని మొక్కిన  చేతి కి  మోక్షము

  శివుని పలికిన  నోటి కి యోగము సంయోగము


యడ్ల శ్రీనివాసరావు 27 Oct 2022 2:00 AM


ధవళము = తెల్లని, స్వచ్ఛత, శుచి.

హరుడు = శివుడు

సాధన = సాధించుట, ఉపాయం, పరిష్కారం.









No comments:

Post a Comment

709. భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి

  భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి • భగవంతుని జ్ఞానం ఆధారంగా శాస్త్రాలలో ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. భక్తి మార్గం లో ఈ విషయాలను కధల రూపం లో...