ప్రేమిస్తాను జీవిస్తాను
• ప్రేమిస్తాను జీవిస్తాను.
ప్రేమే నా లోకం
జీవం నా భాష్యం.
• ప్రేమిస్తాను జీవిస్తాను.
రాతల లోకాన్ని ప్రేమిస్తాను.
పదాల భాష్యం లో జీవిస్తాను.
• నేనున్న నాడు
ప్రేమ ను పంచుతాను.
నే లేని నాడు
కావ్యం లో కనిపిస్తాను.
• ప్రేమిస్తాను జీవిస్తాను
ప్రేమే నా లోకం
జీవం నా భాష్యం.
• ఎవరూ లేని నా లోకం లో
శివుడే తోడు గున్నాడు.
• ఎందరో ఉన్న ఈ లోకంలో
బంధాలే నీడ గున్నాయి.
• ప్రేమిస్తాను జీవిస్తాను
ప్రేమే నా లోకం
జీవం నా భాష్యం.
• మనస్సాక్షి ఉండేది
మనిషి లోనే.
మభ్య పెట్టి జీవిస్తే
మనసు కే దుఃఖం.
• మహా "జ" నటులతో
మసలడం నరకం.
• మౌనం తో మమేక
మవ్వడం స్వర్గం.
• ప్రేమిస్తాను జీవిస్తాను
రాతల లోకాన్ని ప్రేమిస్తాను.
పదాల భాష్యం లో జీవిస్తాను.
భాష్యం = మూలాలను వ్రాసే కావ్య రచన
యడ్ల శ్రీనివాసరావు 24 November 2023, 9:00 pm
No comments:
Post a Comment