Sunday, November 19, 2023

424. మరణం మధురం

 

మరణం మధురం


• మరణం    మరణం

  మనసు

  మతి లో    మధురం.

• జననం     జననం

  జీవన

  గతి లో     గరళం‌.


• మది    మీటిన    మరణం

  ఓ    స్మరణం.

• జవ    దాటిన      జననం

  ఓ    బుణం.


• మధురమైన       మరణం

  మరుజన్మ కు     పునీతం.

• గరళమైన       జననం

  ఇహ జన్మకు      శోకం.


• మరణం      మరణం

  మనసు

  మతి లో      మధురం.

• జననం       జననం

  జీవన

  గతి లో       గరళం.


• ఆశల   ఆటల    అలలు

  కోరికలు.

• ఆరని    చిచ్చుల   వలలు

   వేదనలు.


• సుగుణాల    పునాదులు

  మనుగడకు   మూలాలు.

• అర్రులుచాచే    ఆడంబరాలు

  వికారాల       జీవనాలు.


• మరణం      మరణం

  మనసు

  మతి లో     మధురం.

• జననం     జననం

  జీవన

  గతి లో      గరళం‌


• జననం     ఎందుకో

  తెలియక

  జన్మలు     గడుస్తాయి.

• జన్మ       కారకం

  తెలిసాకే 

  మరణం    మధురం.



గతి = విధానం, దారి

గరళం= విషం.

జవదాటిన = అతిక్రమించిన


యడ్ల శ్రీనివాసరావు 20 Nov 2023 3:00 AM


No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...