Friday, November 17, 2023

423. కరుణ కటాక్షుడు

 

కరుణ కటాక్షుడు



• కరుణ   కటాక్షుడు

  కోమలాంగుడు   శివుడు

  కార్తీకమున   కనకం   నింపే    కాలుడు.


• విభువుని    తలచిన

  ప్రభువుగ    చేసెను  వాముడు.

  విలువలు    వలువగా

  ధారణ    చేసెను    విధుడు.


• కరుణ     కటాక్షుడు

  కోమలాంగుడు   శివుడు.

  కార్తీకమున    కనకం నింపే   కాలుడు.


• హరుని    ఘోషతో

  నరుని    కోరికలకు   మోక్షం.

  శివుని    తపము తో

  జీవుని    బాధలు   మాయం.


• విశ్వ    శక్తి తో

  సూక్ష్ముడైనాడు   శివుడు.

  సూక్ష్మం లోనే

  మోక్ష మిచ్ఛేను    హరుడు.


• కరుణ   కటాక్షుడు

  కోమలాంగుడు  శివుడు.

  కార్తీకమున   కనకం నింపే   కాలుడు.


• ధ్యానమనే   ప్రమిద తో

‌ ఆత్మ  అనే    జ్యోతి     చేరును దైవం.

‌ జ్ఞానమనే    తైలం తో

 బుద్ధి  అనే   సిద్ధి    అగును   యోగం.


• కర్మ భోగ   మే     నరకం.

  కర్మ యోగ మే     స్వర్గం.

  ఆత్మ చైతన్య మే     జీవం.

  పరమాత్మ  స్మృతి యే   కైవల్యం.


యడ్ల శ్రీనివాసరావు 18 Nov 2023, 3:45 AM.


No comments:

Post a Comment

543. శివుని ఎక్కడ వెతకాలి

  శివుని  ఎక్కడ  వెతకాలి  • "శివుని   కోసం వెదుకులాట" ..... అవును నిజమే కదా!  శివుడెక్కడ  ఎక్కడెక్కడ  అని కొన్ని వేల  సంవత్సరాలుగ...