కార్తీక పౌర్ణమి
• సిగ లోన సింగారుడు
శివుని సిగ లోన సింగారుడు.
• కార్తీక పౌర్ణమి న
భువిని జ్యోతి గా
చేసిన శీతభానుడు.
• సిగ లోన సింగారుడు
శివుని సిగ లోన సింగారుడు.
• పూర్ణ కుంభుడై వెన్నెలతో
వెలిగే మగువ మానసుడు.
• నిందలకు నీరుగారని వాడు
నెలవంక లా నిలిచే నిశాకేతుడు.
• సిగ లోన సింగారుడు
శివుని సిగలోన సింగారుడు.
• ఆటుపోట్ల ను ఆనంద
సాగరం చేసే సోముడు.
• మనసును మైనం చేసి
ముగ్దం గావించే సారసుడు.
• సిగ లోన సింగారుడు
శివుని సిగ లోన సింగారుడు.
• హసంతి తాపము ను
వాసంతి గా చేసే హసనుడు.
• శివుని తేజము తోన
మదికి మహారాజు ఆయే చందురుడు.
• సిగ లోన సింగారుడు
శివుని సిగ లోన సింగారుడు.
• కార్తీక పౌర్ణమి న
భువిని జ్యోతి గా
చేసిన శీతభానుడు.
చంద్రుడు = శీతభానుడు, నిశాకేతుడు, మానసుడు, సారసుడు, సింగారుడు, సోముడు, హసనుడు.
భువి = భూమి.
హసంతి = కుంపటి.
తాపము = బాధ, దుఃఖం, ఉద్వేగం, వేడి.
వాసంతి = మల్లె, శాంతం, తెలుపు.
యడ్ల శ్రీనివాసరావు 26 November 2023 10:00 PM .
No comments:
Post a Comment