కార్తీక మీనం
• మంచు ముసుగు వేసింది
మది లో మీనం ఆడింది.
• మతి మధురం అయింది
మనసు జలకం ఆడింది.
• కార్తీకపు లోగిలిలో
పారిజాతపు పేరంటాలు.
• కావేరి కౌగిలిలో
తేనెటీగ ల సంబరాలు.
• వేకువ లో కోకిల లు
కీరవాణి రాగాలు.
• మేలుకొ నే భానుడి కి
ఉషోదయపు గారాలు.
• మంచు ముసుగు వేసింది
మది లో మీనం ఆడింది.
• మతి మధురం అయింది
మనసు జలకం ఆడింది.
• తోట లో తరుణి కి
తామర స తాంబూలాలు.
• సుతి మెత్తని చూపులే
ఉసిరి కసిరే కవ్వింపులు.
• పల్లకీ లో పరిణయం
తెరల చాటు సింగారం.
• జుంకాల జావళి తో
జల్లుమంది గుండె లో.
• మంచు ముసుగు వేసింది
మది లో మీనం ఆడింది.
• మతి మధురం అయింది
మనసు జలకం ఆడింది.
తామరస = బంగారు
జావళి = శ్రావ్యమైన సంగీతం
యడ్ల శ్రీనివాసరావు 8 Nov 2023 , 7:00pm.
No comments:
Post a Comment