Tuesday, January 26, 2021

34. ఆహారం...జీవితం…మనిషి...మనసు…సారుప్యత.

 

·        ఆహారం...జీవితంమనిషి...మనసుసారుప్యత.





·        మనిషి బ్రతకడానికి శక్తి అవసరం.

·        శక్తి కావాలంటే ఆహారం అవసరం.

·        ఆహారం అంటే పాలు,  కాయగూరలు , ఆకుకూరలు,  దుంపకూరలు , మాంసం ఇలా ఎన్నో.  ప్రతి దానిలో  ఎన్నో రకాల, రంగులు, రుచులు, ఆకారాలు, పరిమాణాలు, దేని విశిష్టత, ప్రాముఖ్యం దానిదే.

·        ఏ రకమైన ఆహారం తిన్నా, చివరికి ఉత్పన్నమైన శక్తి ఒకటే అది కిలోక్యాలరీస్.

·        ఇన్ని రకాల ఆహార పదార్ధాలు ఈ సృష్టిలో  ఉన్నా అందరికీ అన్నీ నచ్చవు . కొందరికి మాంసాహారం , మరికొందరికి శాఖాహారం ఇష్టం. మాంసాహారంలో అందరికీ అన్నీ నచ్చవు , అదేవిధంగా శాకాహారంలో కూడా అన్నీ అందరికీ నచ్చవు . కొంతమంది శరీరతత్వానికి , మనస్తత్వానికి కొన్ని రకాలైన ఆహారాలు జీర్ణం కావు. అలాగే కొంతమందికి కొన్ని రకాల దుంప కూరలు  వాత గుణం చేసి కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాలు వస్తాయి.

·        అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనుషులు ఎవరి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం  వారు,  వారికి ఇష్టమైన ,  సరిపడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ...అంతమాత్రాన మిగిలిన ఆహారాలు అన్ని పనికిరానివి అని అర్థం కాదు. ప్రతి ఆహారం ఎవరో ఒకరికి ఏదో ఒక రూపంలో అవసరం అవుతూనే ఉంటుంది,  అది మనిషి యొక్క శారీరక మానసిక అవయవ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది.

·        అలాగే ఏ ఆహారమైన తాజాగా ఉంటేనే  ఎవరైనా స్వీకరించగలరు.

·        ఇక అసలు విషయానికొస్తే ....సమాజంలో మన చుట్టూ ఉన్న మానవులందరు ఉత్తములే (అన్నిరకాల ఆహారాల వలే) , ఎందుకంటే అది భగవంతుడు సృష్టి . మనకి ఈ సమాజంలో అనేక మందితో అనేక రూపాల్లో సంబంధ బాంధవ్యాలు ముడిపడివుంటాయి . కొందరు దేశం వరకు , కొందరు రాష్ట్రం వరకు , కొందరు జిల్లా వరకు , కొందరు ఊరి వరకు , కొందరు వీధి వరకు , కొందరు ఇంటి వరకు , కొందరు మనసు వరకు మితం (ఇష్టం) అవుతూ ఉంటారు (ఇష్టమైన లేదా ఆరోగ్యానికి అవసరమైన  ఆహారం తీసుకుంటున్నట్లే). అది వ్యక్తుల ఆలోచన స్థాయి సరళిని బట్టి ఉంటుంది .  ఇది జగమెరిగిన సత్యం, సృష్టిలో పరంపర కూడా.  అంతమాత్రాన ఒకరు గొప్ప మరోకరు అల్పం అనుకోవడం అవివేకం . మన వ్యక్తిత్వాన్ని మనమే అభివర్ణించు కుంటున్నంత కాలం,  మన ఉనికి మనం ఈ సమాజంలో కోల్పోతున్నట్లే.

·        ఏ వ్యక్తికి సాటి వ్యక్తిని దూషించే హక్కు లేదు . కాలచక్రం లో ఏది చేస్తే అదే తిరిగి పొందవలసి వస్తుంది,  సిద్ధం గా ఉండాలి.  మన మానసిక స్థాయిని బట్టే ఒకరు మనకు అర్థం అవుతున్నారా , లేదా,  అలాగే  ఒకరికి మనం అర్థం అవుతున్నామా లేదా, అనేది ముడిపడి ఉంటుంది . “ ఉన్నతమైన ఆలోచనలే మనలను  ఉత్తముల దగ్గరకు చేర్చగలవు”.   “మన ఆలోచనలే మన జీవిత విధానం” , ఈ ఒక్క నినాదాన్ని కూలంకషంగా  అర్థం  చేసుకోగలిగితే ఈరోజు మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో, మనకే  అర్థమవుతుంది.

·        ఆత్మ విమర్శ అనేది ఆత్మ స్థాయిని పెంచాలి గాని ఆత్మ నాశనాన్ని కాదు .

·        అర్థమైన ధన్యం...వ్యర్థమైన శూన్యం.

·        ఆత్మ విమర్శ తో కూడిన మన వ్యక్తిత్వం మనకి అర్థం కానంతవరకు మన చుట్టూ ఉన్నది అంతా రాజకీయ చదరంగం వలె అనిపిస్తుంది,  కనిపిస్తుంది .

·        మన మనసే మనకు రక్షశిక్ష.

·        మనిషి మనుగడకు మనుషులు అవసరం,…మనుషులకు స్థిరమైన, ఉన్నత తత్వం చాలా అవసరం.

·         If you are REACTIVE PERSON always you will be on the ROAD. From Road you can able to visualise only few things.

·        If you are PROACTIVE PERSON always you will be on the SKY. From Sky you can able to visualise vast things.

·        ఓం శ్రీ గురుభ్యోనమః

 

యడ్ల శ్రీనివాసరావు

No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...