నైరాశ్యం
· మౌనమే మకరందమైనపుడు
· కను బాసలే కలవరింతలైనపుడు
· పలుకు లేమి పెదవులు పలకనపుడు
· మనసులోని మాట మధురమైనా, భారమే.
· సున్నితమైన మనసుకు
సుందరమైన తలంపులు.... కలలే!
· "ప్రే"రణ "మ"రపించుటయే సంతోషమా?
· ఎదురుచూపుల సమయం ఆసన్నమైంది
రెప్పపాటు క్షణం లో ఆవిరైంది,
· విశ్వమంత మౌనాన్ని
అలలు లేని కడలిని
పరిమళం లేని పుష్పాలను
బహుకరించింది.
· చాలు, ఇంతకు మించిన ఆశ.... దురాశే
. ---యడ్ల శ్రీనివాసరావు.
No comments:
Post a Comment