ఏది సబబు శివ
• తండ్రి ఏది సబబు ఏది ఒరవు
తండ్రి ఏది సముచితం ఏది అనుచితం.
• నీకు తెలియని బిడ్డ లెవరు
నీవు ఎరుగని లోకమేది
నేను ఎరుగిన తండ్రి నీవు
నిన్ను ఎరిగిన బిడ్డ నేను.
• కోరికల కోసం కోటి దండాలు పెట్ట లే
ఆశ తో ఆర్తి గా ఏమి అడగ లే.
• సత్యమెరగని కాలము కంటే
సత్యమెరిగిన కాలమే శిక్ష.
• తండ్రి ఏది సబబు ఏది ఒరవు
తండ్రి ఏది సముచితం ఏది అనుచితం.
• జ్ఞాన మెరుగుట అంటే
నిప్పు “వెలుగు”ట అన్నావు.
నిప్పు కి నీరు తోడైన లోకం లో
ఏమి చేయాలి శివా.
• మాయ మోహం కుడి ఎడమ భారాలై తే
నిజమ నే నిన్ను ఎలా చేరాలి శివ.
• శేష కర్మలు కోసం ఏమి చేయాలి
బుణ విముక్తి కై ఇంకేమి చేయాలి.
• తండ్రి ఏది సబబు ఏది ఒరవు
తండ్రి ఏది సముచితం ఏది అనుచితం.
• మాయ నను చూసి నవ్వుతూ అంటోంది
నను విడిచి నువ్వు ఎక్కడికి పోతావని
ఈ మాయ లోకం లో గతి లేక ఉన్నందుకా ?
• మోహము నా పైన జాలి చూపిస్తూ అంటోంది
బ్రతక లేని బంధాలలో బ్రతికే బానిస నని.
ఈ కర్మ గమ్యం లో స్థితి లేక ఉన్నందుకా ?
• తండ్రి ఏది సబబు ఏది ఒరవు
తండ్రి ఏది సముచితం ఏది అనుచితం.
• నీకు తెలియని బిడ్డ లెవరు
నీవు ఎరుగని లోకమేది
నేను ఎరుగిన తండ్రి నీవు
నిన్ను ఎరిగిన బిడ్డ నేను.
యడ్ల శ్రీనివాసరావు 19 March 2023 8:00 PM.
No comments:
Post a Comment