ఎవరికి ఎవరో చివరికి ఎవరో
• ఎవరికి ఎవరో చివరికి ఎవరో
మమతలు నిండిన మనసు లతో
మంచి గా మసిలేది ఎందరో.
• మాయలు నిండిన మనుషుల గా
మసక బారేది ఇంకెందరో
ఎవరికి ఎవరో చివరికి ఎవరో.
• అవసరాల ఆరాటం
కొందరి జీవన వేదం.
• జిత్తులమారి పోరాటం
ఇంకొందరి జీవిత గమనం.
• నాటకాల ఆట లో
రాటు దేలిన మనుషులు …
• రంగులద్దుకొని మాయ లో
మునుగుతారు తెలిసి.
• తుదకు ఆ రంగులే
పూస్తారు అందరితో కలసి.
• ఎవరికి ఎవరో చివరికి ఎవరో
ఎవరికి ఎవరో చివరికి ఎవరో
• మనుషుల తో మసలాలంటే
తికమక లు ఎందుకో.
• మంచి వారిగ మెలగాలంటే
నిజాయితీ చాలని తెలియదు ఎందుకో.
• మనిషి జీవనం రణరంగం
జీవితమే ఒక రంగస్థలం.
• అస్థిరమైన మనసు చేసేది
ఆటు పోటుల పడవ ప్రయాణం.
• ఆరితేరిన అసత్యాలన్నీ
ఏనాటికైనా అగాధపు దుఃఖాలు.
• మోహనికి దాసోహం
విలువ కోల్పోయే వికారం.
• ఎవరికి ఎవరో చివరికి ఎవరో
ఎవరికి ఎవరో చివరికి ఎవరో
• కాలక్షేప కలయికలు
ఏనాటికైనా చేరేది కాలగర్భంలో.
• కాలక్షేమ కలయికలే
ఏనాటికైనా నిలిచేది కాలతలం లో.
• ఎవరికి ఎవరో చివరికి ఎవరో
మమతలు నిండిన మనసు లతో
మంచి గా మసిలేది ఎందరో.
• మాయలు నిండిన మనుషుల గా
మసక బారేది ఇంకెందరో
ఎవరికి ఎవరో చివరికి ఎవరో.
• నాది నాదనేది ఒక చింత.
ఏదీ నాది కాదన్న నాడే నిశ్చింత.
• అందరూ నా వారు అనేది చింత.
నేను ఎవరి వాడిని కాదు అనేది అక్షింత.
• ఎవరికి ఎవరో చివరికి ఎవరో
ఎవరికి ఎవరో చివరికి ఎవరో.
• ఓ మనిషి ....
నీ జీవితం ఎలా ఉన్నా ఆనందించు
కానీ
నీ జీవితం తో నువ్వు ఆటలు ఆడకు.
ఎందుకంటే జీవితం తిరిగి ...
నీతో ఆట ఆడడం మొదలెడితే
నీ ఊహకు కూడా
అందనంత పాతాళంలో ఉంటావు.
• ఈ జన్మలో దొరికిన జీవితం
ఉత్తమమైనా , అధమఃమైనా
ఆనందించడానికే గాని ,
సాటి మనుషులతో ఆటలు ఆడి
అభాసుపాలు కావడానికి కాదు.
స్వీయ అంకితం
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 12 Mar 2023 , 10:00 PM
No comments:
Post a Comment