నిజమ య్యేనా
• ఏదైనా ఏమున్నా
ఏనాటికైనా ఇది నిజమ య్యేనా.
• తెరలు తెరలుగా తరలి వస్తున్న
అలల ఆలోచనలు
ఎక్కడివి ఎన్నటివి.
• కన్నుల కందని లోకంలో
కలల కోట లో రూపాలా.
• ఊయల ఊగే మేఘాలలో
మంచు ను తాకిన స్వప్నాలా.
• ఏదైనా ఏమున్నా
ఏనాటికైనా ఇది నిజమ య్యేనా.
• రవి ని తాకిన బిందువు నై
కవి ని గాంచిన జీవా న్నా .
• జాబిలి మనసు న దీపాన్నై
కవిత రాసిన వెన్నెల నా.
• ఏదైనా ఏమున్నా
ఏనాటికైనా ఇది నిజమ య్యేనా.
• తెరలు తెరలుగా తరలి వస్తున్న
అలల ఆలోచనలు
ఎక్కడివి ఎన్నటివి.
• పన్నీరు చల్లిన భావాలన్నీ
పుష్పం విడిచిన బాష్పా లా.
• పొడిబారిన మది కి తడి
నింపేటి సెలయేరు కావ్యా లా.
• ఏదైనా ఏమున్నా
ఏనాటికైనా ఇది నిజమ య్యేనా.
• రంగులు తెలియని రంగం లో
రాసే రచన ల రూపం.
• పెదవి పలకని లోకం లో
పాడే కోయిల గానం.
• ఏదైనా ఏమున్నా
ఏనాటికైనా ఇది నిజమ య్యేనా.
• తెరలు తెరలుగా తరలి వస్తున్న
అలల ఆలోచనలు
ఎక్కడివో ఎన్నటివో.
యడ్ల శ్రీనివాసరావు 5 Mar 2023 2:00 pm.
No comments:
Post a Comment