Sunday, December 28, 2025

713 . శివానుభవం

 

శివానుభవం



• శివుని   మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం


•  ప్రేమ లోని   మధువు తో    

   నవ వధువు గా   చేసేను   

   విభుడు . . .  నా  విభుడు .

•  ఒడి లోని    లాలన తో   

   పసి పాప గా   ఆడించె 

   హరుడు . . . నా  హరుడు .


• శివుని   మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా  శివుని  ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం .


• ఆలన   పాలన తో

  భవబంధాల  ఆటవిడుపులు   ఇస్తున్నాడు .

• ఆదమరచిన  నన్ను

  ఆనంద సాగరంలో   తేలుస్తూ  

  ఉన్నాడు  శివుడు  . . .  నా శివుడు .


• శివుని మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం .


• పసి వాడి  నని   తలచి

  తన మది ని    సింహాసనం  చేసి

  కూర్చుండ   బెట్టాడు  .

• తోడు గా   నీడ యై   

 తన జత లోని  రాత లతో     

  విశ్వమంతా   విహరింప  

  చేస్తున్నాడు   శివుడు  . . .  నా శివుడు.


• శివుని    మది

  సింహాసనం   . . .   సింహాసనం

• నా శివుని   ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం


• మాటలాడడు    కానీ

  మనసు కి    ప్రేరణ    ఇస్తాడు .

• కనపడడు     కానీ

  కనుల లో   కాంతి యై    ఉంటాడు.

• అనుభవాల   నిచ్చు  వాడు

  శివుడు.  . . .   నా శివుడు .

• అనుభూతి లో   ముంచు వాడు

  హరుడు   . . .   నా హరుడు .


• శివుని  మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం   . . .   ప్రేమామృతం .



ఓం శాంతి

ఓం నమఃశివాయ


యడ్ల శ్రీనివాసరావు 28 Dec 2025 9:20 PM.


No comments:

Post a Comment

713 . శివానుభవం

  శివానుభవం • శివుని   మది   సింహాసనం . . . సింహాసనం • నా శివుని  ఒడి   ప్రేమామృతం . . . ప్రేమామృతం •  ప్రేమ లోని    మధువు తో        నవ వ...