మనసు వీ క్షణం
• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
• కనులు మూసుకున్న నాడే
నా మనసు చూస్తుంది .
• కనులకు తెలియని లోకమే దో
నాకు పరిచయం చేస్తుంది .
• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
• మనసు లోని నిశ్శబ్దం
పరవళ్ళు తొక్కుతోంది ప్రకృతి లో .
• మనసు లోని *వీక్షణలు
దాటి పోతున్నాయి విశ్వాన్ని .
• ఇదే నా తరంగం
ఇదే నా అంతరంగం .
• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
• కనులు మూసుకున్న నాడే
నా మనసు చూస్తుంది .
• కనులకు తెలియని లోకమే దో
నాకు పరిచయం చేస్తుంది .
• తేలుతున్న మనసు కి తనువు
భారమే లేదు .
• సాగుతున్న మనసు కి సంతోషం
హద్ధు లే లేవు .
• ఇదే నా ధ్యానం
ఇదే నా *పరధ్యానం .
• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది
చూస్తుంది . . . నా మనసు చూస్తుంది .
• కనులు మూసుకున్న నాడే
నా మనసు చూస్తుంది .
• కనులకు తెలియని లోకమే దో
నాకు పరిచయం చేస్తుంది .
వీక్షణలు = చూపులు
పరధ్యానం = శివ పరమాత్ముని స్మృతి యానం.
యడ్ల శ్రీనివాసరావు 21 Dec 2025 7:00 PM .



No comments:
Post a Comment