మనసు పయనం
• మనసా ఓ మనసా
నీ పయనం ఎందాకో తెలుసా.
• ఒంటరి వై బాల్యం లో
తుంటరి తుమ్మెద కాలేదు
భారం నిండిన బంతి లా
నేలను తాకుతు నిలిచావు.
మనసా ఓ మనసా .
• భయం నిండిన బాటసారి లా
దిక్కుల నడుమ నలుగుతూ
బంధాలు తెలియని బందీ వై
బ్రతుకు తీపి కై వెతికావు.
మనసా ఓ మనసా .
• మనసా ఓ మనసా
నీకు ఏమి కావాలో తెలుసా.
• ఉరకలు వేసే యవ్వనంలో
ఊయల ఊగే తరుణం లో
రంగుల లోకం చూసావు
రంగులంటక తిరిగావు
మనసా ఓ మనసా .
• ఆశల పల్లకిలో ఎగరాలన్న
ఆకాశం లో దారి తెలియక
అయోమయం తో గడిపావు.
విది వంచన తో పని చేసావు.
మనసా ఓ మనసా.
• మనసా ఓ మనసా
నీలో ఏమి దాగుందో తెలుసా.
• ఊహ కందని దివ్యం తో
సృష్టి జీవ నిక్షిప్తాలు.
అది అంత్యాల చక్రం లో
నిగూఢమైన విశేషాలు.
మనసా ఓ మనసా.
• ఆత్మ పరమాత్మల యోగాలు
జీవన్ముక్తి సోపానాలు
శక్తి బీజ స్వరూపాలు
సేవాభావ పురుషార్థాలు.
మనసా ఓ మనసా.
• మనసా ఓ మనసా
నీ పయనం ఎందాకో తెలుసా
పరమాత్ముని చెంతకు చేరే వరకు.
• మనసా ఓ మనసా
నీకు ఏమి కావాలో తెలుసా
స్వర్గ సీమ లోని ఆత్మానందం.
• మనసా ఓ మనసా
నీలో ఏమి దాగుందో తెలుసా
పూర్వ పుణ్యాల సుకృతం.
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 5 March 2023 , 11:30 pm.
No comments:
Post a Comment