యుగాన బుతువుల ఉత్సవం ఉగాది
వసంత బుతువు – చైత్రం, వైశాఖం
• చైతన్యపు చిగురులు తో చైత్రం చెపుతోంది
స్వాగతం … ఉగాది కి స్వాగతం.
• ప్రకృతి పూవుల సోయగం తో శుభకరం ...
శ్రీరాముని వసంత శోభయ కళ్యాణం.
• మాధవ భరితం వైశాఖం ...
విశేష దానాల ముక్తి ఫలప్రదం.
• తెల్లని మల్లెల చల్లదనం తో
మురిసే శ్రీవారి చందనోత్సవం.
• పచ్చని మామిడి తోరణాల తో
మెరిసే సత్యదేవుని కళ్యాణం.
గ్రీష్మ బుతువు – జ్యేష్టం , ఆషాఢం
• మండే ఎండల గ్రీష్మం తో
తాపన మయింది జ్యేష్టం.
• జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి
విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలము.
• భగభగలాడే జ్యేష్ఠం
దారులు వేసింది ఆషాఢ మేఘానికి.
• పులకరించి న ప్రకృతి
తొలకరి జల్లులతో ధాత్రిని హరితం చేసింది.
• గురు దీవెన కోసం చేసే గురుపౌర్ణమి పూజ
ఆషాఢం లో వ్యాసుని జన్మ దినము న.
వర్ష ఋతువు – శ్రావణం, భాద్రపదం
• శ్రావణ మాసపు చినుకులు
శ్రవణానందపు గజ్జెలు.
• పట్టు చీరల రెప రెప లలో
చామంతుల సొగసు లతో
పసుపు పారాణి యై వచ్చింది
వరలక్ష్మి పూజ సౌభాగ్యం.
• భాద్రపదపు చిత్తడి వర్షం
పంటల పాలిట బంగారు హర్షం.
• శుద్ధ చవితి న గణపతి పూజ
సకల విఘ్నాల మోక్షము.
• శుక్ల పక్షం లోన దేవత నోములు
కృష్ణ పక్షం లోన మహాలయ పితృ పూజలు.
శరత్ బుతువు - ఆశ్వయుజ, కార్తీకం
• సమశీతోష్ణపు తేమతో
ఆహ్వానం పలికే ఆశ్వయుజం.
• శరత్ నవరాత్రుల తో శోభిల్లింది
విజయ దుందుభి శక్తి ఆవాహం.
• నిర్మల నీలాకాశం
ఈ వెన్నెల కాచే కార్తీకం.
• భువి ని దీపాలతో నింపి
శివుని కీర్తించే కైవల్యం ఈ కార్తీకం.
హేమంత బుతువు – మార్గశిర , పుష్యం
• మంచు తెరలుగా
తరలి వచ్చేదే హేమంతం.
• చక్కిలిగిలి చల్లదనం తో
తనువును మురిపించే మార్గశిరం.
• శాంతి సౌందర్యాలతో
ప్రకృతి సంచరించేటి కాలం.
• పుష్యమి నాటికి ఫలమై
చేతికి వచ్చే పైరు పంటలు.
• జన జీవన స్రవంతి సంక్రాంతి న
వెల్లి విరిసే కొంగొత్త ఆనందాలతో.
• పూర్వీకుల స్మరణ తో
శాంతి చేకూరే పితృదేవతలకు.
శిశిర బుతువు - మాఘం, ఫాల్గుణం.
• చెట్లు ఆకులు రాల్చే శిశిరం
ఆహ్లాదం నింపే ఈ వయనం.
• చలి గాలుల గలగల లై
చిలిపి గా పలకరించేను మాఘం లో.
• జ్ఞాన ధారణ కై పూజించే
తల్లి సరస్వతిని మాఘ పంచమి న.
• శివుడు ఆరుద్రుడై లింగాకారంలో
ఆవిర్భం చెందే శివరాత్రి పర్వదినాన.
• ధ్యాన యోగాల సంయోగం
మాఘ ఫాల్గుణాల సంగమం.
• ఫాల్గుణ అమావాస్య తో
నిండెను ఒక యుగము ...
చైత్ర శుద్ధ పాడ్యమి తో
జనియించెను కొత్త ఉగాది .
5:50 pm . 22 March 2023.
No comments:
Post a Comment