తీరం చేరని నావ
• తీరానికి తీరం ఆమడ దూరం
నావకు తెలియదు నది లోతు వయనం.
• భాష ల ఘోషణ తో అలల మౌనం
వీచే గాలి లో వినిపించెను రాగ భాషం.
• తెరచాప ను తాకిన తరంగం
దిశ చూపే ప్రకృతి భావం .
• తీరానికి తీరం ఆమడ దూరం
నావకు తెలియదు నది లోతు వయనం.
• నావ కు పెరిగెను వేగం
పరవళ్లు తొక్కెను నదీ నాదం.
• మీనాల జలకాల తో సాగెను
నావ తో సుందర సహగమనం.
• తీరానికి తీరం ఆమడ దూరం
నావ కు తెలియదు నది లోతు వయనం.
• కారు మబ్బుల కమనీయం
చిరు జల్లుల సోపానం.
• ఉరుముల మెరుపుల గంభీరం
అలలు చేసెను రాకాసి నృత్యం.
• తీరానికి తీరం ఆమడ దూరం
నావ కు తెలియదు నది లోతు వయనం.
• ఈదురు గాలులు ఉధృతం
నావ కు తుళ్లి పడుతుంది భయం.
• సుడిగాలి లేచేను అమాంతం
నావ కు తెలిసెను నది లోతు గర్భం.
• తీరానికి తీరం ఆమడ దూరం
నావ చేరలేదు తీరం
కానీ చేరింది గమ్యం.
• తీరానికి తీరం ఆమడ దూరం
ప్రకృతి చూపులు నిశ్చలం.
• కాలానికి కాలం ఎంతో దూరం
మనసు కి తెలియదు జన్మ మారిన వయనం.
• కర్మల ప్రాప్తం జీవన వేదం
సుఖదుఃఖాలు జీవిత గమనం.
యడ్ల శ్రీనివాసరావు 30 March 2023 9:00 pm.
No comments:
Post a Comment