కంచికి చేరని కధ
• అనగనగా ఒక కధ ఉంది
కధ లోన ఒక వ్యధ ఉంది.
కధ కంచికి చేరదు కానీ
కదనం తొక్కుతూ ఉంటుంది.
• కాలం రాసిన ఈ కధకు
కలం సాక్షి కానంటుంది.
కలకలం సృష్టించ లేనంటుంది.
• జీవము నిండిన పాత్రలు
ఎన్నో
సజీవం గా నే ఉన్నాయి.
• చలనం లేని జీవాలై
నిర్జీవంగా నిలిచి ఉన్నాయి.
• నట నే ఎరుగని తారలు
అభినయం కోసం వేచి ఉన్నాయి.
• మాటలు తెలియని పక్షుల్లా
మౌనంగా చూస్తూ ఉన్నాయి.
• అనగనగా ఒక కధ ఉంది
కధ లోన ఒక వ్యధ ఉంది.
కధ కంచికి చేరదు కానీ
కదనం తొక్కుతూ ఉంటుంది.
• జగము న ఏలేటి జగడాలు
ఈ కధలో నడిచే విడ్డూరాలు.
• ఊహకు అందని ఎన్నో సిత్రాలు
కన్నుల ఎదుట నిలిచే విచిత్రా లై.
• పరిణితి చెందిన ఈ కధ పాత్రలు
ప్రేక్షకపాత్ర లో ఒదిగాయి.
• కాలం కదలక చూస్తుంది
కధ లిపి కోసం.
• అనగనగా ఒక కధ ఉంది
కధ లోన ఒక వ్యధ ఉంది.
కధ కంచికి చేరదు కానీ
కదనం తొక్కుతూ ఉంటుంది.
• కాలం రాసిన ఈ కధకు
కలం సాక్షి కానంటుంది.
కలకలం సృష్టించ లేనంటుంది.
యడ్ల శ్రీనివాసరావు 18 March 2023 10:00 PM.
No comments:
Post a Comment