పని పిల్ల
• పని పిల్ల పని పిల్ల
విధి లేక పని చేసే చిన్న పిల్ల
• బాల్యం లో బరువులకు బందీ గ అయి
భాధ్యత గా బానిస లా బ్రతుకుతున్నావు.
• పని పిల్ల పని పిల్ల
గతి లేక పని చేసే చిన్న పిల్ల
• కరువు నిండిన కుటుంబంలో కుందేలు అయి
కడుపు నిండ నీ స్థితి తో బ్రతుకుతున్నావు.
• ఈడు పిల్లల ను చూసి నీ కళ్లు మెరవగా
తోడు గా నీకు లేరని భోరున ఏడ్చావు.
• జడకు వేలాడు రిబ్బన్లు తో మురిసి పోతూ
కాలి నరిగిన చెప్పులతో చలించి పోయావు.
• పని పిల్ల పని పిల్ల
స్థితి లేక పని చేసే చిన్ని పిల్ల
• చిరుగు బట్టలతో సింగారి బొమ్మలా
నేల ఊడుస్తూ అందం గా చేస్తావు.
• చదువు సంధ్యలు లేని చిన్నారి వి
పాపపుణ్యములు ఎరుగని పాపాయి వి
• తలకు తైల మెరుగని నీ పేదరికం
పనికి అడ్డంకి కాలే ఉన్నోళ్ల శుభ్రానికి.
• పని పిల్ల పని పిల్ల
గతి లేక .. విధి లేక .. స్థితి లేక
పని చేసే పని పిల్ల
• ఆటపాట లెరుగని అమాయకపు పిల్ల
అమ్మ నాన్న లకు నీవొక చేతి కర్ర
• కలతలు ఎరుగని కుందనాల పిల్ల
ఎంత కష్టమైనా నీ ముందు తల దించే.
• బ్రతుకు కే బాట నేర్పించు నీ అనుభవాలు
బంగారు భవిష్యత్తు బలము గా నీ సొంతం.
• పని పిల్ల పని పిల్ల
బంగారు పసి పిల్ల
మానవత్వం తో చేర దీస్తే
మనసున్న వారందరికీ మన పిల్ల.
ఇళ్లలో , కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో పని చేసే చిన్న పిల్లలను మంచి మనసు తో చూడండి. ఆదరించండి.
పాపం … చిన్న పిల్లలు, పసి పిల్లలు. మన పిల్లలు లా పెరిగే అవకాశం వారికి ఈ జన్మలో దొరకలేదు.
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 16 March 2023. 11:00 PM.
No comments:
Post a Comment