పౌర్ణమి
• వచ్చిందోయ్ వచ్చింది
నిండు జాబిలి వచ్చింది.
పండు వెన్నెల తెచ్చింది
భూమి అంతటా పంచింది.
• మసక బారిన మనసు లకు
మంచి ముత్యాలు ఇచ్చింది.
ముఖాన చిరునవ్వుల ను
చిలకరించేసి వెళ్లింది.
• వచ్చిందోయ్ వచ్చింది
నిండు జాబిలి వచ్చింది
పండు వెన్నెల తెచ్చింది
భూమి అంతటా పంచింది.
• పక్షం రోజుల కు
పరువం నింపుకుని వస్తుంది.
రోహిణి తారక పై
లాలిత్యం ఒలక పోస్తుంది.
• కవుల మది లోన మెరిసేలా
కమ్మని కవితలు ఎన్నో ఇస్తుంది.
కొమ్మ న నిలిచిన కోయిల చే
కోటి రాగాలు పలికిస్తుంది.
• వచ్చిందోయ్ వచ్చింది
నిండు జాబిలి వచ్చింది
పండు వెన్నెల తెచ్చింది
భూమి అంతటా పంచింది.
• భావోద్వేగాల నడుమ
నవరసాలను ధారణ చేస్తుంది.
ఆశల భాసల తో
లలిత కళలకు జీవం పోస్తుంది.
• నేలను తాకే నీడకు
సాక్షి భూతి గా ఉంటుంది.
అనురాగం పంచే మనిషి కి
ఆనంద రూపం అవుతుంది.
• వచ్చిందోయ్ వచ్చింది
నిండు జాబిలి వచ్చింది
పండు వెన్నెల తెచ్చింది
భూమి అంతటా పంచింది.
యడ్ల శ్రీనివాసరావు 7 March 2023 12:30 AM
No comments:
Post a Comment