అర్ద నారీ ఈశ్వరం
మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో.
అమెరికా లో స్థిరపడిన నా ఇంటర్మీడియెట్ మిత్రుడు మరియు నా శ్రేయోభిలాషి బొడ్డు శ్రీహరి కుమార్తె చిరంజీవి "ఈషా". ఇటీవల అమెరికా లో ప్రదర్శించిన శివుని "అర్థనారీశ్వర" రూప నాట్యం.
• తెలుసు కో మానవ తెలుసు కో
శివుడంటే తండ్రే కాదని
శివుని లో ఓ తల్లి ఉందని.
• తెలుసు కో మానవ తెలుసు కో
శివుడంటే తండ్రే కాదని
శివుని లో ఓ తల్లి ఉందని.
• అర్ధనారీశ్వరుని నిదర్శం
సకల మానవాళికి ఆదర్శం.
• మానవ జన్మకు మూలం మహిళని
మహిళ లేనిదే మనుగడ లేదని
ప్రకృతి లో స్త్రీ నిలిచింది.
సృష్టి కే ఆరాధన అయ్యింది.
• తెలుసు కో మానవ తెలుసు కో
మహిళంటే మనిషి కాదని
మహిళంటే మహాశక్తి అని.
• అమ్మ లోని అమృతం
మనిషి జీవానికి ఊపిరి.
• నారి లోని నిర్మలం
సహనం నింపే చైతన్యం.
• తెలుసు కో మానవ తెలుసు కో
మహిళంటే *భోగి కాదని
మహిళంటే భాగ్య మని.
• వనిత లోని వెలుగు
నిర్బయ మిచ్ఛే వీరత్వం.
• లలిత గా ప్రేమ తో
లాలిత్య మిచ్ఛే లతాంగి.
• తెలుసు కో మానవ తెలుసు కో
మహిళంటే బొమ్మ కాదని
మహిళంటే మానవత్వ మని.
• ఫలితం పొందక
ఫలాల నిచ్చే వృక్షం మహిళ.
• మగ ని మోడు గ కాకుండా
పరిమళం నింపేటి కుసుమం మహిళ.
• మహిమాన్విత మహిళ కి
సర్వ శక్తులు దాసోహం
అందుకే మహిళంటే
ఆదిశక్తి రూపం ... పరాశక్తి స్వరూపం.
• తెలుసు కో మానవ తెలుసు కో
• శివుడంటే తండ్రే కాదని
శివుని లో ఓ తల్లి ఉందని.
• మహిళంటే మనిషి కాదని
మహిళంటే మహాశక్తి అని.
• మహిళంటే భోగి కాదని
మహిళంటే భాగ్య మని.
• మహిళంటే బొమ్మ కాదని
మహిళంటే మానవత్వ మని.
భోగి = విలాస సుఖము నిచ్ఛె
మహిళా దినోత్సవ శుభకాంక్షలు 💐
మహిళలు గా జన్మించిన వారు మానవ మూలాలలో పురుషుల కంటే ఎంతో మానసిక బలవంతులు. ఇది భగవంతుడు స్త్రీ లకు ఇచ్చిన వరం . ఎందుకంటే స్త్రీకి ప్రతిసృష్టి తత్వం వలన , ఓర్పు, సహనం, నిర్మలం, ప్రేమ వంటివి స్త్రీ శరీర నిర్మాణంలో జన్మతః సహజంగా ఏర్పడిన విశిష్ట మైన లక్షణాలు ఇవి.
స్త్రీ ని ఆదిశక్తి అని, పరాశక్తి అని అంటారు. ఆది శక్తి అంటే శక్తి కి మూలం. పరా శక్తి అంటే వీరత్వానికి , శత్రు సంహరానికి ప్రతీక.
ఒక మనిషి (ఆడ లేదా మగ) ఈ భూమి మీద పెరగాలి అంటే ముఖ్యం గా, ఒకటి మనుగడ చెయ్యాలి. రెండవది శత్రువుల నుంచి తనను తాను రక్షించు కోవాలి.
మనిషి మనుగడకు కావలసిన శక్తి , ఆదిశక్తి. మనిషి రక్షణ కి కావలసిన శక్తి , పరాశక్తి. ఈ రెండు శక్తులు ఎవరికైనా లభించేవి స్త్రీ నుంచి మాత్రమే. అందుకే పరమాత్ముడు అయిన శివుడు, సగభాగం స్త్రీ ని తనలో నిలుపుకొని మానవాళికి సందేశం ఇచ్చాడు. స్త్రీ లేనిదే ప్రతి సృష్టి లేదని తెలియచేసాడు.
నేటి కలియుగ కాలంలో సైన్స్, సాధనాలు, గొప్ప చదువులు, అభివృద్ధి అంటూ పరుగులు పెట్టే మానవునికి సనాతన ధర్మం, కుటుంబ విలువలు, బంధాలలో ఉన్న ఔన్నత్యం మరియు ఉన్నతి ని కోల్పోయి అధోగతి తో, మానసిక ఒత్తిడి తో కూడిన జీవితం తో జీవనం సాగిస్తు సుఖం శాంతి లేక జీవిస్తున్నాడు.
దీని వలన నేటి తరం లో చాలా మంది కి మనుషుల పట్ల, మానవ సంబంధాల పట్ల కనీస అవగాహన, మర్యాద, సరియైన మాట తీరు లేకుండా అయోమయ పరిస్థితిలో వివాదాలతో జీవనం సాగించడం నేడు ప్రతి చోటా కనిపిస్తుంది.
స్త్రీ ఎక్కడైతే పూజింప బడుతుందో , ఆ ప్రదేశం స్వర్గ సీమ అవుతుందని సాక్షాత్తు భగవంతుని సందేశం.
స్త్రీ లను పూజించక పోయినా పరవాలేదు కనీసం గౌరవించండి.
ఒకవేళ గౌరవించడం చేత కాకపోయినా పరవాలేదు కానీ చులకన గా, అవమానం గ చూడకండి, మాట్లాడకండి.
మంచిని చెప్పడం ప్రోత్సాహించడం, భారతీయుని సంస్కారం.
అదే విధంగా మంచిని ఆచరించడం ప్రతీ మనిషి ధర్మం.
• ఓం శాంతి 🙏
• ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 7 March 10:00 PM.
No comments:
Post a Comment