అభినేత్రి...నా అభినేత్రి (పాట)
• కనులే కలువలా......వలపే వలువలా
ఓ నేత్రి .... నా అభినేత్రి *2*
• రెపరెపలాడే చిన్ని కన్నులు
టపటప లాడే చిన్ని రెప్పలు
కిలకిలలాడే చిన్ని నవ్వులు
ముసి ముసి గెగిరే చిన్ని ముంగురులు
నీవేనా......అవి నీవేనా.... * 2 *
ఓ నేత్రీ ..... నా అభినేత్రి
• మందారంలో మకరంద మై
సింగారం లో సింధూర మై
పాపిడి పిందెల పరువం తో
సిగ మెరిసిన సిరిమల్లెల తో
నీవేనా... అది నీవేనా * 2 *
ఓ నేత్రి ....నా కళాభినేత్రి
• నీ పలుకే పారిజాతమై,
నీ చూపే చంద్రబింబమై,
నీ సొగసే సోయగమై,
నీ అందమే నవనీతమై నా
నావేలే…..అవి నావేలే
ఓ నేత్రి.... నా అభినేత్రి....నా కళాభినేత్రి
• గల గల లాడే కాలి గజ్జెలు
అటు ఇటు గెంతే చిన్ని గంతులు.
చక్కిలిగిలి చుక్కల్లో
ఉక్కిరిబిక్కిరి విన్యాసాలే
వశమే నా….నా పరవశమగునా
ఓ నేత్రి … నా నేత్రి ….. హ్రుదయాభినేత్రి
• నీ కోకే సీతాకోకై,
నీ వర్ణమే సువర్ణమైనపుడు,
ఆకాశమే చిన్నబోయెనే,
హరివిల్లే దోబూచులాడెనే,
నెలవంకే నవ్విపోయెనే.
ఓ నేత్రి….నా నేత్రి….నా తన్మయత్రి.
• కనులే కలువలా......వలపే వలువలా
ఓ నేత్రి .... నా అభినేత్రి . * 2 *
యడ్ల శ్రీనివాసరావు
Feb 11 2021, 10:45 pm.
No comments:
Post a Comment