పుష్పధామము
• పూలతోటలన్ని భూలోక
స్వర్గధామములవుతుంటే
స్వర్గలోక దేవతలే
నందనవనము లో ని పుష్పములు.
• పువ్వులు ఎన్నున్నా పరిమళమన్నది ప్రత్యేకం.
• పువ్వుల రూపం ఏదైనా రమణీయం ఒక్కటే.
• పూరంగులు ఎన్నైనా రంజనమనమే ప్రత్యేకం.
• పూపరిమళం ఏదైనా పరవశం ఒక్కటే.
• తొలకరి తొడిమ న ఊయల ఊగుతూ,
ఊగిసలాడే మొగ్గ లోని మనోహరం
మొక్క కెంతో సింగారం.
• వసంతాన కేరింతల లో,
విరజిల్లే పరిమళం తో,
వికసించిన పుష్పానికి,
ఫ్రౌడ(యవ్వనం) మెంతో పారవశ్యం.
• చేతి లో చేరిన చామంతులు
చెక్కిలి గిలికి చెలగాటమాడుతుంటే
సిగలో చేరిన మల్లెలు సిరిసిరిమువ్వలా
సిగ్గు పడుతున్నాయి.
• ఎదపై చేరిన మాల కనక “ అంబరాల “
ఆనందంతో ఉంటే
పాదముల చేరిన పారిజాతాలు పూజకు
తపించే పద్మములై ఉన్నాయి.
• గులాబీ ల గుబాళింపు గుండె లోన
అలజడులవుతుంటే
మల్లె లోని ఉద్వేగమే మరువలేని మైధునం.
• విరజాజి ల విరహమే వరూధినికి
వన్నె తెస్తుంటే
బంతి లోని బరువు శరీరానికి ఉల్లాసము.
• సంపెంగ సుగంధం వెన్నెల రాత్రి లో
విహారం చేస్తూ ఉంటే
చందమామ కలువలా చూస్తూ ఉంది.
• లిల్లీ ల లీల లే సంగమ కేళి లో
కెరటాలవుతుంటే
మొగలి పువ్వు మన్మధునికై పరితపిస్తూ ఉంది.
• మనసు నెరిగిన మందారం
మగువని పిలుస్తూ ఉంటే
సిత్రాల సన్నజాజి నడుము కై
వెతుకుతూ ఉంది.
• పులకరించే పువ్వులు పలకరిస్తూ ఉంటే
ప్రేయసి పలుకుకున్నా
పువ్వులు పదముల రూపం లో పోంగి పొర్లి
ప ద ని స లై ప్రియురాలి చెంతకు చేరాయి.
యడ్ల శ్రీనివాసరావు 16 Dec 21 9:00 pm.
No comments:
Post a Comment