పరిణయ నిశ్చితార్థం
(బాల్య మిత్రురాలి కుమార్తె వివాహ నిశ్చితార్థం సందర్భంలో, ఆ ముక్కంటి ఆదేశానుసారం …✍️)
• పరిణయమే పరిణయమే
మనసు ను చేరిన సింధూ పరిణయమే .
• మధువనమే మధువనమే
వధువు ను గాంచిన జీవిత మధువనము .
• ఉప్పొంగుతున్న ఉల్లాసమే ,
ఎద లోతు లోని లావణ్యము .
• ఉవ్విళ్లూరుతోన్న ఆరాటమే ,
నవ జీవనాన సౌభాగ్యము.
• పరిణయమే పరిణయమే
మనసు ను చేరిన సింధూ పరిణయమే .
• మధువనమే మధువనమే
వధువు ను గాంచిన జీవిత మధువనము .
• మేళ తాళాల వైభోగమే,
తెర చాటు సిగ్గు సౌందర్యం .
........అదియే .....అదియే .... అదియే....
తొలకరి మొగ్గకి ఆనందం.
🌹🌹🌹🌹
• పరిణయమే పరిణయమే
మనసు ను చేరిన సింధూ పరిణయమే
• మధువనమే మధువనమే
వధువు ను గాంచిన జీవిత మధువనము.
• దేవతల దీవెనలే తలంబ్రాలవుతున్న వేళ లో
• సింధూర తిలకాన సౌందర్యము
సింధూరి దారల సమ్మోహనం.
• దేవతల దీవెనలే తలంబ్రాలవుతున్న వేళ లో
• సింధూర రాగానా సన్నాయి ,
సింధూర గానాన మధురామృతము.
• పసుపు ఛాయన సింధూర కి
పాదాల పారాణి సింధూరం .
• ........అదియే.... అదియే.....అదియే.....
సత్య శంకరుల ఆనందము.
🌹🌹🌹🌹🌹
• పరిణయమే పరిణయమే
మనసును చేరిన సింధూ పరిణయమే
• మధువనమే మధువనమే
వధువు ను గాంచిన మధువనమే
• వధూవరుల తాంబూలమే
పరిణయ సాక్షి అవుతున్న వేళలో
• అరిటాకు తోరణాల అభివాదమే
విందు వేడుకల ఆతిధ్యము.
• హరివిల్లు తుమ్మెదల విహరమే,
తాటాకు పందిరి కి మకరందము.
• వేద మంత్రాల సాంగత్యము,
ముత్తైదు తాంబూల ఆశీస్సులు.
• …….అదియే..... అదియే..... అదియే.....
శివ పార్వతుల సంకల్పం.
• …….అదియే..... అదియే..... అదియే.....
అది దంపతుల ఆశీర్వాదం.
• పరిణయమే పరిణయమే
మనసు ను చేరిన సింధూ పరిణయమే
• మధువనమే మధువనమే
వధువు ను గాంచిన జీవన మధువనమే
🙏🙏🙏
యడ్ల శ్రీనివాసరావు 8 Dec 21 10:45 pm.
No comments:
Post a Comment