యువతరం – నవతరం
(SRKR Engineering college , Bhimavaram Freshers Day & Parents meet (29/11/21 10:00am ) సందర్భంలో , ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు exhibition లో చూసి, విద్యార్థులు నైపుణ్య వంతులు గా మారే విధానం professors ద్వారా విని…. ప్రేరణతో యువత కోసం, యువతను ఉద్దేశించి✍️)
• నింగి ఎంత ఎత్తు నున్న
ఎగిరే పక్షి కి హద్ధే ముంది లే.
• సంద్రం ఎంత లోతు ఉన్న
ఈదే చేప పిల్ల కి అలుపే ముంది లే.
• బురద ఎంత మురికి గున్న
పూచే తామర కలువకి ధుర్గుంధ మేముంది లే.
• బ్రతుకు ఎంత భారమైన
భరోస నిచ్చే అండ ఉంటే బరువే ముంది లే.
• దారి ఎంత దూరమైన
దారి ఎంత ధీనమైన
గుండె నిండ ధైర్యముంటే దారి అంత దివ్యమేలే.
• చింత లెన్ని చిగురు లైన
చిద్విలాసి తోడు ఉంటే చింతే ముంది లే.
• కష్టం తో కరిగించు నీ లో లో ని కాలుష్యాన్ని
నింగి కెగిరే చేప పిల్ల నీ కే సొంతం.
• తపన తో సృష్టించు నీ దైన తారాలోకాన్ని
సంద్రం లో ఈదే పక్షి పిల్ల నీ కే సొంతం.
• ఏకాగ్రత లో ఏకం కానియ్ నీ గతం
కలువ వంటి మనసు నీ కే సొంతం.
• లక్ష్యమెంత కఠినమైన లక్షణమే నీ ఆయుధం.
భారమై న చింత లన్ని నీ లో నే అంతం.
• నైపుణ్యం లో నే ఉంది నీ పుణ్యం
అదే తరతరాలకు చెక్కు చెదరని నీ రూపం….నీ ప్రతిభ.
YSR 29 Nov 21 , 6:00 pm.
No comments:
Post a Comment