జగన్నాటకం
• సాగుతున్నది
కాలం కలలా .
• ఊగుతున్నది
జీవితం ఊయల లా .
• సాగే ఊగులాటలో
తేలి మునుగుతున్నది
మనసు మంచు పల్లకి లా.
• ఎందాకో ఈ పయనం
ఎటువైపో ఈ గమనం.
• పయనంలో
ప ద ని స ల పరిచయాలు ఎన్నెన్నో.
• గమనం లో
గడబిడ లు ఎందరో
*గమకమలు ఎవ్వరో.
• ఆటుపోటుల ఆటల్లో
అమృతమే దొరికేనా
గరళమే మిగిలేనా.
• అమృతమే దొరికితే
ఆనంద నందనము లను నిర్మిస్తా.
• గరళమే దొరికితే
గంధర్వ మని జ్ఞానముతో సేవిస్తా.
• దర్శకుడు లేని నాటకం
ఎంతో పేలవం.
పరమాత్మ ను ఎరుగని
జగన్నాటకం మహా ప్రళయం.
• పయనంలో పోతూ ఉంటే
రంగుల లోకం
రా…రా…. అంటుంది.
• పాత్రధారులంతా
రంగులతో రమణీయంగా ఉన్నారు.
• రమణమెంత ఉన్నా
రక్తి లేదు నాటకానికి
బహుశా రంగు వెలసి పోతుందేమో.
• గమనంలో పోతూ ఉంటే
దివ్యలోకం
దా… దా… అంటుంది.
• పాత్రధారులు
లేరక్కడ
అందరూ సూత్రధారులే (దేవతలు).
• ఎటు వెళ్ళాలో ...
ఎన్నాళ్ళో ఈ పయనం
ఎన్నేళ్ళో ఈ గమనం.
• ప్రతిభ కలిగిన నటునికి
నాటకం ఒక ఆట
జగన్నాటకం ఒక పాట.
యడ్ల శ్రీనివాసరావు 14 Nov 2021 , 4:00 am.
*గమకము = హృదయంగమము, మనసు కు ఇంపైన వారు
*ఆనందనందలాలు = సంతోషమే నే పూల తోటలు
*గంధర్వుము = మరణానికి పునర్జన్మ కి మధ్య కాలంలో యాతనా శరీరమును ధరించిన ప్రాణి
No comments:
Post a Comment