Monday, November 8, 2021

103. ఒకటి పైన ఒకటి…..ఒకటే

 

ఒకటి పైన ఒకటి…..ఒకటే


• “ఒక” లాంటి వారమే

   ”ఒకే” లాంటి వారమే


• ఒకటి ప్రక్కన ఒకటి ఉంటే 

  అది ఒకటి కాదు.

• ఒకటి పైన ఒకటి ఉంటే 

  ఎప్పటికి ఒకటే కదా.


• ఒకరి ప్రక్కన ఒకరుంటే 

  ఒకటి కాము.

• ఒకరి పైన ఒకరుంటేనే 

   ఒకటవుతాము.


• స్థిరమైన మనసుకు 

  సుస్థిరమైన మనిషి కలయిక 

  ఎన్నటికీ అస్థిరం కాదులే.


నాకున్నది ఏనాడూ నాదనుకోలేదు

 ”నాదనుకున్న నన్ను” 

  నిన్ను నాదే అనుకుంటున్నా.


• వెలుగు నిచ్చి కరుగుతున్న 

  మన జీవీతాలకు కూడా ఎద లోతుల్లో ని 

  చీకటి నశించే సమయం ఆసన్నమైనది.


• కాలం ఎంతుందో

  జీవనం ఎంతుందో తెలియదు కానీ 

  ఇకపై జీవన కాలమంతా మనదే.


యడ్ల శ్రీనివాసరావు 9 Nov 2021 11:00 am.






No comments:

Post a Comment

619. ఓ యాత్రికుడా

  ఓ యాత్రికుడా • ఓ యాత్రికుడా  . . .   ఓ యాత్రికుడా   తెలుసుకొను    నీ   గమ్యం . • ఆత్మంటే     అర్దం    ఎరుగక   ఆత్మీయత లని     ఎగిరే   నీ ...