ప్రేమ సామ్రాజ్యం
• కిల కిల లాడే అటు ఇటు ఊగే
పూవుని అడిగితే
తన సంతోషానికి కారణం
నీ కురులలో స్థానం అంటుంటే ...
• ఏమై పోవాలి
నేనేమై పోవాలి ... నేను ఏమవ్వాలి.
• రెప రెప లాడుతూ రివ్వుమంటున్న
గాలి ని అడిగితే
తన ఉత్సాహనికి కారణం
నీ ముంగురులు తాకినందుకు అంటుంటే ...
• ఏమై పోవాలి
నేనేమై పోవాలి ... నేను ఏమవ్వాలి.
• జర జర జారే వొంపుల సొంపుల
సెలయేరు ని అడిగితే
తన కేరింతలకు కారణం
నీ పాదముల స్పర్శ అంటుంటే ...
• ఏమై పోవాలి….
నేనేమై పోవాలి … నేను ఏమవ్వాలి.
• గలగలలాడే *గమపద
కాలి గజ్జెలని అడిగితే
తన సవ్వడి కి కారణం
నీ నెమలి నాట్యమే అంటుంటే …
• ఏమై పోవాలి
నేనేమై పోవాలి … నేను ఏమవ్వాలి.
• తహతహలాడే తలపు వలపుల
మనసు ని అడిగితే
తన పులకరింతకు కారణం
నీ మనసు లో ఉన్న నేనే అంటుంటే …
• ఏమై పోవాలి
నేనేమై పోవాలి ... నేను ఏమవ్వాలి.
• పూవునై గాలిలొ ఎగిరి
సెలయేరు లో పడి
నీ మనసు కు గజ్జె నై
అల్లుకు పోవాలని ఉంది.
🥀🥀🥀🥀🥀
• నీ తో ఆడిన ఆటలే ఆనందాలవుతుంటే
అంతు చిక్కని *నందనాలకు
ఎదురు చూస్తున్న ఓ *ప్రణయని.
• నా లోని ప్రతిభ
నీ లోని *బింబం
కలిసిన ప్రతిబింబమే
మన జీవన బింబం ... ఓ *చంద్రహాసిని.
• నీ అడుగు లోని నా అడుగు లే
పయనించే మన జీవన *మడుగు అవుతుంటే
ఆకాశమంతా జీవితం కావాలనిపిస్తోంది
ఓ *వరూధిని.
యడ్ల శ్రీనివాసరావు 31 Oct 10:00 pm 8985786810.
• గమపద= ఒయ్యారమైన నడక.
• నందన = అధిక సంతోషాలు.
• బింబం = రూపం, వెలుగు.
• ప్రణయని= వివాహం చేసుకొనే ప్రేయసి.
• చంద్రహాసిని= చంద్రుని రూపము వంటి స్త్రీ.
• మడుగు = జలాశయం, శుద్ధి యైన గుణము.
• వరూధిని = గంధర్వ స్త్రీ.
No comments:
Post a Comment