స్నేహ చక్రం
• స్నేహం…స్నేహం…ప్రాణానికి సాయం.
• బుడి బుడి అడుగుల వయసులో……తెలిసి తెలియని రాగం.
• (Elementary 5-10 yrs)
• స్నేహం…స్నేహం…జీవానికి ప్రాణం.
• చిట్టి పొట్టి నడకల వయసులో……..తపన చెందే తానం.
• (Primary 10-12 yrs).
• స్నేహం…. స్నేహం…. ప్రాణానికి మోహం.
• వడి వడి అడుగుల వయసులో…….ఉరకలు వేసే పల్లవి.
• (Upper Primary 13-15 yrs).
• స్నేహం…స్నేహం….మోహనికి సంతోషం.
• తడి పొడి మాటల వయసులో……. మబ్బుల చాటున దాగిన రహస్యం.
• (Intermediate Teen 16-19 yrs).
• స్నేహం….స్నేహం…. సంతోషానికి సంబరం.
• గల గల చేతల వయసులో….. వెంట ఉండే ధైర్యం.
• (youth 20-30 yrs).
• స్నేహం…. స్నేహం….సంబరానికి *మేళం.
• భవ బంధాల ముడుల వయసులో….. అవసరమయ్యే సుగంధ పరిమళం.
• (Above Youth 30-50 yrs).
• స్నేహం….. స్నేహం…..మేళవింపుకి జీవం.
• ఎద లోతుల అనుభవాల వయసులో….. మనసు విడనాడలేని బంధం.
• ( Pre old 50-65 yrs).
• స్నేహం…. స్నేహం….. జీవానికి పునరుజ్జీవనం.
• ఏకాంతపు ఒంటరి వయసులో…. మనసుకి ప్రేమ, తనువుకి చేయూత అదే స్నేహానికి పరమార్థం.
• (Till to Death 65 + yrs)
స్నేహమంటే కాలక్షేపం కాదు..... స్నేహమంటే కాలక్షేమం.
…..అదే అదే సుగంధ భరితమైన స్నేహం , బంధాలు ఎన్నో ఉన్నా, సృష్టి లో స్నేహం ప్రత్యేకం. ఎందుకంటే …. స్నేహానికి బంధుత్వం, వయోభేదం, లింగభేదం, జాతి కులమతాలు, ధనిక పేద భావాలు, లేవు….. మంచి స్నేహం లో ఉండేది, ఉండవలసింది ఒక్కటే, నిజాయితీ…. విశ్వాసం…..సహాయం….అర్థం చేసుకోవడం.
ఈ స్నేహం అనేది కేవలం కలిసి చదువుకున్న వారిలో నో, లేదా కలిసి పని చేసే వారిలో నో ఉండవలసిన అవసరం లేదు... స్నేహం ఒక యోగం అయినపుడు భార్య, భర్త, పిల్లలు, తల్లి తండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్ని భవ బంధాల లో ను ఉంటుంది.... కానీ ఈ ముడి బంధాల లో స్నేహం చిగురించాలంటే...... ఎంతో స్వేచ్చ, త్యాగనిరతి తో అర్థం చేసుకునే విశాలమైన హృదయం కావాలి....
తామరాకు లా, కలువ పువ్వులా కలుషితం కానిదే స్నేహం.
YSR 20 Nov 2021, 7:00 pm.
No comments:
Post a Comment