రుద్ర అక్షిత
• ఈశ్వరా పరమేశ్వరా
ఏమిటయ్యా ఈ చిత్రం
ఎందుకయ్యా ఈ విచిత్రం.
• గమ్యమెరుగని పాదచారి కి
అలసి సొలసి న బాటసారి కి
*భవితమేమిటో చూపిస్తున్నావయా.
• కలలు *కల్లలైన బాల్యానికి
నడి యవ్వనాన బాల్యం కలపిస్తున్నావయా.
• జ్ఞానమెరుగని ఈ క్షీణ జీవి పై
కరుణ చూపి కమలం చేస్తున్నావయా.
• ఏమి ఈ చిత్రం
ఎందుకో ఈ విచిత్రం
ఈశ్వరా పరమేశ్వరా.
• మూగబోయిన మాటకు
మూలనిధినే స్వరము గా చేసావయా
• కదలలేని కరములకు “కధ”లనిచ్చి
*కదం తొక్కిన కవి గా కాంచావయా.
• నీ మననం తో మనోనేత్రం లో
*ఆరుద్ర గా చేసి ఆత్మ చరితం చేసావయా.
• ఏమివ్వగలను నీకు
ఏమి చేయగలను నీకు
నీ కీర్తనతో సంకీర్తన తప్ప.
• జన్మమెరుగని వానికి
పూర్వజన్మ శేషం కరిగిస్తున్నావయా
• నీ పాద ధూళి నై, నిను తాకాలని ఉంది
ఈశ్వరా…పరమేశ్వరా…
యడ్ల శ్రీనివాసరావు 4 Nov 21 10:00 pm
*భవితము = Destiny, విధి, తలరాత, అదృష్టం
*కల్లలైన = నాశనమైన, పాడైన
*ఆరుద్ర = శివుని కంటనీరు తో తడుస్తూ ప్రకాశించే నక్షత్రం
*కదం= గుర్రం పరుగు
No comments:
Post a Comment