• పంచభూత సమ్మిళిత రూపా
సమస్త జీవ ఆత్మాశ్రయా
• మాయను మాపే మాయావి
జ్ఞానం నింపే సద్గురువా
• శ్మశానమే ఆవాస మంటావు
భస్మమే జీవం అంటావు.
• ఈశ్వరా ఓంకార రూపేశ్వరా
• త్రిలోకం త్రిగుణం త్రినేత్రాధి నేతనంటావు
త్రిశూలంతో రక్షణ నిస్తావు
• ధ్యానమే ధ్యాసంటావు
ధ్యానంలో దర్శనమిస్తావు
• ధ్యానేంద్రా ఓ యోగీంద్రా
• కంఠ గరళంతో కరుణిస్తావు
సిగ చంద్రుడితో శాంతి నిస్తావు
• నీలకంఠేశ్వరా ఓ అర్ధ నారీశ్వరా
• నీ కంటి భాష్పాలే
అక్షతలయ్యాయి రుద్రాక్షలయ్యాయి
• ఈశ్వరా ఓ రుద్రేశ్వరా
• ఢం ఢం ఢం ఢమరుకమే
శక్తి నాదమంటావు
లయ తప్పని శృతికి నటరాజువి.
• ఈశ్వరా ఓ చిదంబరేశ్వరా
• శరణు కోరిన జీవికి బోళాశంకరుడివి
శరణు తప్పిన పాపికి సంకట హరుడివి
• ఓ శంకరా బోళా శంకరా
• ఆడుకుంటావు మాతో
ఆటాడుకుంటావు మాతో
మా తత్వము నెరుగు శక్తి లేని వారము
నీ తత్వము నెట్లు తెలుసుకోగలమయ్యా.
• ఈశ్వరా ఓ జ్ఞానేశ్వరా
• తెరిపించ వయ్యా మా మనోనేత్రం
మరిపించ వయ్యా మా మూర్ఖత్వం
యడ్ల శ్రీనివాసరావు. 2021 June
No comments:
Post a Comment