Friday, July 30, 2021

74. నీ లోని నేను


నీ లోని నేను


• పలికే  పదాలకు   ఏమి తెలుసు, 

  నీ పెదవుల  కలయిక  తప్ప  ....

  నీ పలకరింపు లోని  పరవశం.


• ముసి ముసి  నవ్వులకు   ఏమి తెలుసు,

 మురిపించడం  తప్ప ....

 నీ   నవ్వులోని   ముత్యాల విలువ.


• అణుకువ లేని కోపానికి ఏమి తెలుసు, 

  కోలాహలం తప్ప .... 

  నీ కోపం వెనుక కోమల స్వభావం.


• గర్వానికి ఏమి తెలుసు,  

  గాంభీర్యం తప్ప ...

  నీ గర్వం లో  దాగి ఉన్నది   ఆత్మస్థైర్యం  అని.


• కారే   కన్నీటికి   ఏమి తెలుసు, 

  కలవరం తప్ప ....

  నీ కంటి వెనక కావ్యం.


• నీ  అంతర్యానికి  ఏమి  తెలుసు , 

  నిస్తేజం తప్ప  ....  

  తేజోవంతమైనదని   నీ జీవితం.


• నడిచే   పాదానికి   ఏమి తెలుసు, 

  నీ భారం  తప్ప  ... 

  నిను మోసే   భూమి  విలువ.


• బంధానికి  ఏమి  తెలుసు, 

  బందీలను  చేయడం తప్ప  ....

  ఇది   జన్మాంతర   బుణం అని.


• నేను  రాసే  రాతలకు   ఏమి తెలుసు, 

  ఎగుడుదిగుడు   కదలికలు తప్ప ....

  నా రాతలలోని   సజీవ  ప్రేమ  తత్వం.


• అనుకుంటేనే  తప్ప   

  నీవెవరివో  నేనెవరినో  .....

  లేకపోతే   నీవే నేను,   నేనే నీవు.


యడ్ల శ్రీనివాసరావు

30 July 2021 5:00 am 









No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...