Wednesday, July 7, 2021

71. నటరాజ వైభవం

                            నటరాజ వైభవం

( చిదంబరంలో శివుడు నటరాజ స్వరూపుడై, నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. చిదంబర రహస్యం ఏమిటంటే “భక్తుడు తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భగవంతుడు తన భక్త్తుడి అజ్ఞానాన్ని తొలగింపచేసి, ఆయన యెక్క దర్శన ప్రాప్తి కలిగించి, ఆయన ఉనికిని అనుభవించేసి, ముక్తిని ప్రసాదిస్తాడు.”)

నటరాజ నీ రూప నీరాజనం......కనులారా అరవింద శ్రీ రాజసం.

రసరంజ రాగానికి నర్తించే నీ నాట్యం.....సృష్టి స్థితి లయల సోపానం‌.

బ్రోటనవేలి బింబం పై తాండవమాడే అభినయాల ఆనందరూపా.

నవరసాల అష్టాశత(108) భంగిమలతో నలుదిక్కుల నడయాడే నీ నాట్యం విశ్వ సమ్మోహనాస్త్రం.

నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలే  జనన మరణాల చక్రం.

నీ జటాజూట అలల తరంగాలకు,  మా డబ్బెది రెండు వేల నాడులు కంపనలై, ప్రకంపనలై అణువణువున జ్వలించెను మా లో  ఓంకారం.  

ఆహా!  ఏమి ఈ అద్భుతం ఈశ్వరా!  పరమేశ్వర!.

నీ అడుగుల సవ్వడులే ఖగోళ కదలికల పర్యంతం.

నీ చూపుల మోహం.....అనంత విశ్వ తారల తళుకుల తేజం.

నీ దేహం అనంత వాయువుల  ఖగోళ శక్తికి కర్మాగారం.

అజ్ఞానాన్ని అణగదొక్కే నీ పాద సంకేతం.....మానవ జన్మ స్థితికి కారకం.

నీ రూపం నిరాకారం.....అదియే చిదంబర రహస్యం.

చిదానంద రూపం.... శివోహం శివోహం.🙏


YSR  7 July 21 11:00 pm.

No comments:

Post a Comment

493. స్థితి - గతి

స్థితి - గతి • అలలై    పొంగెను   అంతరంగం   కలలై     సాగెను    జీవన రాగం. • ఆశల     హరివిల్లు    ఆకాశం లో   ఊహల  పొదరిల్లు   కీకారణ్యం లో • ...