ఆట ఎవరికెరుక…. నీవు ఆడే ఆట ఎవరికెరుక
( మహాదేవుని ఆటలు)
• ఆట ఎవరికెరుక
ఆడే ఆట ఎవరికెరుక
ముక్కంటి…..ఓ ముక్కంటి.
• మనసులకు మాయ కలిగిస్తావు.
దుఃఖంతో భ్రమలు తొలగిస్తావు.
ఆట ఎవరికెరుక
నీవు ఆడే ఆట ఎవరికెరుక.
• మోహం కలిగిస్తావు
వ్యామోహం కలిపిస్తావు
తుదకు అంతా మాయేనంటావు.
• నీ రాతలో శిలలెందరో శిల్పాలెందరో
• కనులు మూసి కదం తొక్కుతూ
పాపపుణ్యాల లెక్కలు కడతావే.
ఆట ఎవరికెరుక
నీవు ఆడే ఆట ఎవరికెరుక.
• ఎవరికి ఎవరు ఏమవుతారో
బంధువులెవరో రా బంధులు ఎవరో
• బంధాలతో బంధీలను చేసి
కొందరిని బలవంతులుగా ,
మరికొందరిని బలహీనులుగా
మారుస్తావెందుకో నీ ఆట ఎవరికెరుక శివా.
• ఆశలతో అందలమెక్కిస్తావు
ఆనందంలోనే అన్నీ ఆవిరి చేసెస్తావు.
• నీరును సృష్టించి జీవం పోశావు
కన్నీరును సృష్టించి జీవం తీస్తావు.
• మా లో ఉంటావు
మహిమలు చేస్తావు
మోక్షాన్నిస్తావు.
• చావు పుట్టుకల నడుమ
ఆట బొమ్మలతో నీవు ఆడించెడి
ఆట ఎవరికెరుక.
• లయ తప్పని నటరాజువి
నట జీవులకు రారాజువి.
• బూడిదనే విభూతి చేసి
భూలోకాన్ని ఏలే, భూ తల వాసి.
ఆట ఎవరికెరుక
నీవు ఆడే ఆట ఎవరికెరుక
ఈశ్వరా…. పరమేశ్వరా.🙏🙏🙏
యడ్ల శ్రీనివాసరావు (YSR) 1 July 21 8:00 am
No comments:
Post a Comment