ప్రేమికుల ప్రకృతి పరిణయం
(మూలం: త్యాగశీలురైన ప్రేమికుల ను ప్రకృతి ఆశీర్వాదించి, పరిణయం గావించిన తరుణం.)
·
ఎన్నాళ్ళో……ఎన్నేళ్ళో కలలు
కరుణించెను, మదిని మరిపించెను.
·
చిగురించిన
ఆశలు చిరుదివ్వెలైన వేళ నీ వసంతమే
తోరణం.
·
పవళింపున ఊహలు ఆసన్నమై వేళ మన ప్రాయమే పందిరి.
·
మమత
లోని మాధుర్యం మధురమైన ఈ వేళ
మన మైత్రీయే తాంబూలం.
·
నమ్మకమే
*నాంది గా, *నవనీత మైన
వేళ మన సహచర్య మే జీలకర్ర
బెల్లం.
·
గాజుల
సవ్వడి తో , గజ్జల
అలజడులే శృతిలయలు అయిన వేళ మన
నడకలు అయ్యెను
ఏడు అడుగులు.
·
పంచ
భూతాలే వేదపండితులై, పశుపక్షాదులు దేవతలైన వేళ సార్థకమయ్యేను మన పరిణయం.
·
వికసించిన
మనసులకు
, తొలకరి
జల్లులే తుమ్మెదలయిన వేళ చిరునవ్వులే తలంబ్రాలు.
·
నీ
చూపులోని భావం, నా
మనసులోని మాట మమేకమైన వేళ
ఆవిర్భవించిన
అర్థాంగివి.... తోడు నీడ ల అర్థానివి.
YSR 25 JUN 21 5:00 am
పవళింపు = నిద్రలో
నాందీ = దేవతల ఆశీస్సులు
నవనీతం = చిలికిన తాజా వెన్న
No comments:
Post a Comment