గీతం…గానం…సంగీతం…ప్రేమం
( ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా…. గీతాన్ని, గానాన్ని, పాటని, పదము ప్రేమిస్తే, కీర్తిస్తే కలిగే భావం…ఈ చిన్న ప్రయత్నం…. సంగీత ఆరాధకుల కోసం.)
• గీతమా…..ఓ గీతమా…గగనంలో విహరింపచేసే సంగీతమా…..నా గానమా.
• సంతోషం లో స్వరాలను….బాథ లో భావాలను పలికించే మాధుర్యమా…గీతమా…ఓ….నా గానమా.
• పదనిసల పయనంలో పరువమే పులకించి పలికించే ప్రాణమా…..ఓ గీతమా…నా గానమా…
• నరుని నరాలను నవనీతం చేసే నాదమా…ఓ స్వరరాగమా…
• జాబిల్లి కి జోల పాడుతూ…. జలజల *జాలువారే జలపాతమా…గీతమా...సంగీతమా
• తకదిమిల తాళం….శ్రుతిలయల మేళం… *సమ్మోహన రాగం….వినువిందు భాగ్యం
• మనసుని మైనం చేసి……*మధువు కి జీవం పోసే….గేయమా….నా గానమా.
• కుహు..కుహు… కోయిలల కీర్తనలు…..సలసలల సవ్వడుల సంకీర్తనలై…. స్వరం ఆడెను…..సరిగమలతో పాడెను…శ్రావ్యమా, ఓ సన్నజాజి రాగమా…
• రాగం రమణీయం మైనపుడు…తానం తన్మయత్వం చెంది……పల్లవి పరవశించెను…పురివిప్పిన నెమలిలా…..
• గీతమా…గీతమా…. గొంతు లోని గానంతో….భాషలోని భావంతో…..శిలను సైతం శిల్పం గా మార్చిన, తరంగాల తరంగిణి.
YSR 19 June 20, 4:00 am
జాలువారే = ప్రవహించే.
సమ్మోహన = ముగ్ధుల్ని చేసే
మధువు = తేనే
No comments:
Post a Comment