చెలి మనోహరం
• కన్నుల్లో నిలిచిన నా చిత్రమా
కన్నీళ్ల కు కరగకుమా
కనులే కలవరపడతాయి.
• గుండెల్లో దాగిన నా గానమా
గుబులు చెందకుమా
గాత్రమే *ఘనీభవించును.
• అరవిందం లో ఒదిగిన చెలి అందమా
అలజడి చెందకుమా
అమరమయ్యేను నా ప్రాణం.
• మురిపెం నిండిన,
ఓ మగువ ముంగురులారా
మిళితమవ్వకుమా
మన్మధుడే మదనమయ్యేను.
• నీ నడక లో ఇమిడిన నాట్యమా
నలత చెందకుమా
నృత్యమే మరిచి పోయేను నెమలి.
• నీ మేని చందనాల పరిమళమా
సిగ్గు పడకుమా
ప్రకృతి యే పరవశించకుండేను.
• ఓ అలంకారాల అపురూపమా
అలక చెందకుమా
హరితమే విరహం చెందేను.
• నీ చిరుమందహసానికి
బృందావనం లోని పుష్పాలు
మైకంతో మంత్ర ముగ్ధులవుతుంటే ...
ఆహ, చెలి
ఇదే నీకు నా నజరానా.
“ నా రచనకు
జీవం నీ రూపం …
ఈ అక్షరజ్యోతి కి
తైలం నీ మనోహరం.”
యడ్ల శ్రీనివాసరావు 13 June 21 , 10:00 am.
No comments:
Post a Comment