మనిషి ప్రస్థానం
• మనిషి ... ఓ మనిషి
తెలుసా … ఏమవుతుందో తెలుసా
• ప్రకృతి తో మమేకవ్వమంటే
వికటాట్టహాసం చేస్తున్నావు.
• ప్రకృతి వికృతి అయి
విలయతాండవం చేస్తుంటే
తిరిగి ప్రకృతి నే ప్రార్థిస్తున్నావు.
• ఎందుకు ఈ ద్వందం
ఏల నీ బుద్ధి అల్పం.
⭐⭐⭐⭐⭐
• వృద్ధి, వృద్ధి, అభివృద్ధి అంటూ….
ప్రకృతి పై పైశాచికం చేశావు (చెట్లు నరకడం)
ప్రత్యామ్నాయంగా ఏం చేశావు.
• ఏం…నీవు మాత్రమే జీవివి
పశుపక్ష్యాదులు, వన్యప్రాణులు
వృక్షాలు జీవులు కావనున్నావా
ఎందుకీ వివక్ష…..దేనికీ దుర్బుద్ధి.
• రంగులు పూసుకుని, రూపం మార్చుకుని,
రజోగుణం తో జీవితాన్ని రణరంగం చేసుకునే
దౌర్భాగ్యం నీ కెందుకు.
⭐⭐⭐⭐
• నీటి బుడగ నీ జీవితమంటే
ఏనాడైనా శోధించావా
ఏనాడైనా పరిశీలించావా.
• జననం మరణం సహజం అంటే
ఏనాడైనా విన్నావా, ఏనాడైనా కన్నావా.
• అందుకే కాబోలు
కాలం నీకు కరోనా రూపం లో
కమనీయంగా తెలియచేస్తుంది.
⭐⭐⭐
• భయం నీ రక్షణ కాదు , భక్షణ.
ధైర్యం నీ శత్రువు కాదు , హితవు.
• మనిషి మారు, ఇకనైనా మారు
మారకపోతే సృష్టిలో జరిగబోయే
మార్పును చూడడానికి నీవుండవు.
• బూజు పట్టిన బుర్రలోని అజ్ఞానమనే
బురద ను తొలగించి ,
జ్ఞానమనే పాదరసం నింపు.
• పంజా విప్పిన పులిలా,
ప్రగతి పధం లో ధర్మం తో పయనించు.
⭐⭐
• మాయను వీడు, సత్యం తెలుసుకో
నీవు పంచభూతాల మిళితం
ప్రకృతి లో అంతర్భాగం.
• మనిషి…ఓ మనిషి,
మననం చేసి చూడు నీవు ఎవరివో ...
పరమాత్ముని అంతరాత్మ లో
నీవొక దృశ్యము కాని కణం …
గ్రహించకపోతే అది నీ కర్మఫలం.
• శాంతం నీ శక్తి
సహనం నీ యుక్తి
అదే నీకు ముక్తి.
YSR 8 June 21 11:00 pm
No comments:
Post a Comment