ఆటలాడకండి మనుషుల తో
• ఆడకండి ఆడకండి
మనుషుల తో ఆడకండి.
• ఆడకండి ఆడకండి
మనసుల తో ఆడకండి.
• భావోద్వేగాల తో ఆటలు
అస లే ఆడకండి.
• దేహని కి గాయమైతే
కాలం తో సమసితుంది.
• హృదయానికి గాయమైతే
కాలం లో ... కాలం లో
పయనిస్తూ నే ఉంటుంది.
• కర్మ ఎంతో గొప్పది
ఫలితాలను వడ్డీతో ఇస్తుంది.
• అది తారతమ్యం ఎరుగక
అందరినీ ఒకేలా చూస్తుంది.
• ఆడకండి ఆడకండి
మనుషుల తో ఆడకండి.
• ఆడకండి ఆడకండి
మనసుల తో ఆడకండి.
• భావోద్వేగాల తో ఆటలు
అస లే ఆడకండి.
• అవసరాలు కోసం
నమ్మక ద్రోహులు గా మారకండి.
• తేనె పూసిన కత్తి లా
మాయ మాటలతో కవ్వించకండి.
• ముందు వెనక మాటలు మారుస్తూ
తుచ్ఛులు గా కాకండి.
• బ్రతుకు బాటలో దొరికిందే
సంతోషమని భావించండి.
• భావోద్వేగాలనేవి బలహీనతలు కావు.
పొంది పొందని అనుభవాలకు ...
పొంది పొందని అనుభవాలకు
అవి ప్రతిరూపాలు.
• ఆడకండి ఆడకండి
మనుషుల తో ఆడకండి
• ఆడకండి ఆడకండి
మనసుల తో ఆడకండి
• భావోద్వేగాల తో ఆటలు
అస లే ఆడకండి.
యడ్ల శ్రీనివాసరావు 5 Sep 2024 9:00 PM
No comments:
Post a Comment