శివుడు సాక్షి
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• మా లోని మంచికి …. మా లోని చెడు కి.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• మాయలు చేస్తాం
తెలివి తో మభ్య పెడతాం.
• మోసం చేస్తాం
అతి తెలివి తో వ్యవ "హారిస్తాం".
• మమ్ము గమనించేది
మమ్ము గమనించేది …
ఎవరనుకుంటాం.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• మా లోని మంచికి …. మా లోని చెడు కి.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• పాపాలు చేసెస్తూ
నీకు వాటాలు ఇస్తాం.
• పూజలు చేసెస్తూ
భక్తి తో పాపాఘ్నం అంటాం.
• మమ్ము గమనించేది
మమ్ము గమనించేది …
ఎవరంటూ
శివోహం ... శివోహం అంటుంటాం.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• మా లోని మంచికి …. మా లోని చెడు కి.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• అకృత్యాలు చేస్తాం.
జీవన శైలిలో సహజం అంటాం.
• వికారాల లో విహరిస్తాం.
సుఖ సంతోషాలు గా భావిస్తాం.
• జన్మాంతరాలు గా
ఈ సంస్కారాల తోనే
ఆరి తేరి 'పోతున్నాం'.
• మార ని బుద్ధి తో
మరలా ఇలాగే ... ఇలాగే
జన్మిస్తూ ఉంటాం.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• మా లోని మంచికి …. మా లోని చెడు కి.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• పాపాల ఫలితం దుఃఖ మని ...
పుణ్యాల ఫలం సుఖశాంతి అని …
చేసే ప్రతి కర్మకి శివుడే సాక్ష్యమని ...
ఎవరికి తెలుసు … ఎందరికి తెలుసు.
• సాక్షి వై నావు శివ
సాక్షి వై నావు.
• మా లోని మంచికి …. మా లోని చెడు కి.
శివోహం = నేనే శివుడిని .
మానవుడు ఏనాడూ శివుడు కాలేడు... కాడు.
కానీ శివుని యొక్క శక్తి మాత్రమే స్వీకరించ గలడు.
పాపాఘ్నం = పాపం నశించింది.
యడ్ల శ్రీనివాసరావు 1 Sep 2024 10:00 AM.
No comments:
Post a Comment