కళ్యాణం
• ఈ రేయి పలికిన రాగం నిరీక్షణం.
ఈ వెన్నెల వేసిన తానం సంగమం.
ఈ కాలం రాసిన పల్లవి కళ్యాణం.
• రాగం తానం పల్లవి
మధురం … సుమధురం.
• ఈ రేయి వెన్నెల కాలం
యోగం … సంయోగం.
• అలికిడి లేని అందెల లో
సరిగమలు సన్నగిల్లాయి.
• ఊగిసలు లేని జుంకాల లో
పదనిసలు బోసి పోయాయి.
• ఈ రేయి పలికిన రాగం నిరీక్షణం
ఈ వెన్నెల వేసిన తానం సంగమం
ఈ కాలం రాసిన పల్లవి కళ్యాణం.
• నిరీక్షణ సంగమ కళ్యాణం
రంజనం … రస రంజనం.
• రాసి వేసిన పలుకుల
గారం … శృంగారం.
• అలజడి లేని ముక్కెర కి
ఊపిరి తాపం కరువయ్యింది.
• జీవం లేని మోము కి
నెలవంక లోటయ్యింది.
• ఈ రేయి పలికిన రాగం నిరీక్షణం
ఈ వెన్నెల వేసిన తానం సంగమం
ఈ కాలం రాసిన పల్లవి కళ్యాణం.
• ఈ గళం శుభ మంగళం
ఈ భోగం భూత సంభోగం.
భూత = గతం.
యడ్ల శ్రీనివాసరావు 10 Sep 2024 7:00 PM.
No comments:
Post a Comment