ఎందుకీ జన్మ
• ఎందుకిచ్చావు శివా
నాకు ఈ జన్మ
• ఏమి మెచ్చావు శివా
నా పూర్వ కర్మ.
• త్రికాలమున సంధ్యనొనర్చ లేదు .
త్రిదళ పత్ర పూజ జేయలేదు .
• తల్లితండ్రుల గొప్ప నెరుగ లేదు.
గురువుల సేవ జేయలేదు.
• దాన ధర్మములు జేయలేదు.
జనులకు మేలు నొసగ లేదు.
• ఎందుకు మరెందుకు.
ఎందుకు మరెందుకు.
• ఎందుకిచ్చావు శివా
నాకు ఈ జన్మ.
• ఏమి మెచ్చావు శివా
నా పూర్వ కర్మ.
• సత్యము నంటి ఉంటి నా ...
లేక
ధర్మము నే విడువ కుంటి నా.
• వేద వాదములు నేర్చితి నా ...
లేక
పురమున కీర్తి గడించితి నా.
• ఎందుకు మరెందుకు
ఎందుకు మరెందుకు.
• ఎందుకిచ్చావు శివా
నాకు ఈ జన్మ
• ఏమి మెచ్చావు శివా
నా పూర్వ కర్మ.
• సంసారము న సైనికుడై నందు కా ...
లేక
జీతభత్యం లేని సేవకుడినై నందు కా.
• బంధుమిత్రుల వంచన సహియించి నందు కా ...
లేక
నిందలు దండలు గా ధరించి నందు కా.
• ఎందుకు మరెందుకు
ఎందుకు మరెందుకు.
• ఎందుకిచ్చావు శివా
నాకు ఈ జన్మ
• ఏమి మెచ్చావు శివా
నా పూర్వ కర్మ.
• కారణం ... ఏదైనా కానీ
ఇచ్చిన ఈ జన్మా న
నా చేయి పట్టావు …
అది చాలు శివ.
• ఊపిరి విడిచిన గాని
నీ తోడు మాత్రం విడవను శివ.
యడ్ల శ్రీనివాసరావు 18 Sept 2024 10:00 PM
No comments:
Post a Comment