దేహము కాదిది … వేదన కాదిది
• దేహము కాదిది …. దేహము కాదిది
దహనము తో ఎగిసే చితి ఇది.
• వేదన కాదిది .... వేదన కాదిది
వేదము తో నడిచే గతి ఇది.
• చితి లోని భస్మం శుద్ధం ..
అది ఈశ్వరుని చేరు స్వరూపం.
• గతి లోని మార్గం జ్ఞానం ..
అది ఈశ్వరుడు చూపే గమ్యం.
• వ్యధ తో సాగెను మర్మము నాడు.
శివస్మృతి తో కలిసెను కర్మము నేడు.
• దేహము కాదిది …. దేహము కాదిది
దహనము తో ఎగిసే చితి ఇది.
• వేదన కాదిది …. వేదన కాదిది
వేదము తో నడిచే గతి ఇది.
• దూర తీర మేగితే
మనసు దారం అవుతుంది.
• కడలి నడుమ చేరితే
స్థితము నిశ్చల మవుతుంది.
• దిక్కు తెలియని బాటసారి నాడు.
దిశ చూపే పాత్ర ధారి నేడు.
• దేహము కాదిది …. దేహము కాదిది
దహనము తో ఎగిసే చితి ఇది.
• వేదన కాదిది …. వేదన కాదిది
వేదము తో నడిచే గతి ఇది.
• వ్యర్దమున్న చోట సమర్థము ఉండలేదు.
సమర్థమున్న చోట సంప్రాప్తి ఉండును .
యడ్ల శ్రీనివాసరావు 28 Aug 2024, 10:00 pm
No comments:
Post a Comment