బాల్యం - నీడలు
• నను వీడని బాల్యం
నీడ గా వస్తుంది.
• నా జీవిత కావ్యాన్ని
తోడు గా తెస్తుంది.
• మధురిమలు లేవు కానీ
మనసున్న గురువులు ఎందరో ….
• ఆ రోజులు రావు కానీ
ఆ గురుతులు నేటి కీ ఎందుకో….
• నను వీడని బాల్యం
నీడ గా వస్తుంది.
• నా జీవిత కావ్యాన్ని
తోడు గా తెస్తుంది.
• తల దువ్వే అమ్మ లో ఏదో ఆనందం.
బహుశా … బహుశా
అమ్మ లోని " బాల్యం " నేనే అయి ఉంటా…
• చేయి వదలని నాన్న లో ఏదో కలవరం.
బహుశా … బహుశా
నాన్న లోని " భయం " నేనే అను కుంటా ...
• సంబరాలు తెలియని ఆ ప్రాయం
సంస్కారం నేర్పింది.
• తెలివి తెలియని ఆ కాలం
సంయమనం నేర్పింది .
• నను వీడని బాల్యం
నీడ గా వస్తుంది.
• నా జీవిత కావ్యాన్ని
తోడు గా తెస్తుంది.
• నాటి పాఠశాల విలువలు
నేటి బ్రతుకు కి పునాదులు.
• కల్మషం లేని ఆనాటి స్నేహాలు
ఎదురు చూపుల ఉషోదయాలు.
• ఆవిరి అయిన ఆ గతం
అంతరంగం దాటి పోలేదు … ఎందుకో.
• ఊపిరి అయిన మనో గతం
పసితనం వీడి పోలేదు … ఎందుకో.
• బహుశా … బహుశా
బాల్యం నా ప్రాణం.
బాల్యం నా మరణం.
• నను వీడని బాల్యం
నీడ గా వస్తుంది.
• నా జీవిత కావ్యాన్ని
తోడు గా తెస్తుంది.
యడ్ల శ్రీనివాసరావు 5 August 2024 .9:30 pm.
No comments:
Post a Comment