శివ పరమాత్మ - రక్ష బంధనం
• ప్రతీ బంధానికి మూలం ఆత్మ బంధం.
ఆత్మ బంధానికి కారణం బుణానుబంధం.
*మూలం అంటే …. *నేను ఎవరు?.
• నేను ఎవరు అనేది తెలియాలంటే ..... ధ్యానం జ్ఞానం యోగం యొక్క అభ్యాసం చేయడం ద్వారా మూలాధార చక్రం జాగృతి అవుతుంది. తద్వారా "నేను" అంటే దేహం కాదు, ఒక ఆత్మ ను అనే సత్యం తెలుస్తుంది.
• నేను ఒక ఆత్మ ను అనే సత్యమైన మూల స్థితి పొందిన వారికి , ఏ ఆత్మ తో ( మన చుట్టూ భౌతికంగా ఉన్న మనుషులు ) ఎటువంటి బంధమో స్పష్టం గా అనుభవం అవుతుంది …. ఏ బంధం తో ఎలాంటి బుణమో , స్పష్టం గా తెలుస్తుంది.
• మనో దృష్టితో చూస్తే …. ఆత్మలన్నీ , తండ్రి అయిన శివ పరమాత్మకు బుణం. అదే విధంగా తండ్రి అయిన శివుడు కూడా, పిల్లలైన ఆత్మల కు బుణం. కర్మ సిద్ధాంతం సృష్టించిన శివుడు కూడా కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటాడు. కర్మ సిద్ధాంతం అనుసరిస్తాడు, ఆచరిస్తాడు.
• దేహ దృష్టి తో చూస్తే. ….. తల్లి తండ్రి, భార్య భర్త , అక్క చెల్లి, అన్న తమ్ముడు, ప్రియతములు, స్నేహితులు, శత్రువులు, బానిసలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలలో మనిషి నటిస్తూ చేసిన కర్మలే ఆత్మల మధ్య బుణాలు.
• బంధం అంటే ముడి. ఇదే బంధీ గా మారుస్తుంది. బంధీ అంటే చిక్కుకు పోవడం. దీనినే బంధనం అంటారు. ….
• పరమాత్మ అయిన శివుడు సంగమ యుగం లో అంటే కలియుగంలో ప్రస్తుత అంత్య కాలములో (ఈ సమయం ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ పూర్తిగా దుఃఖమయం) ఈ దుఃఖ బంధనాల నుంచి విముక్తి కలిగించేందుకు రక్షణగా , “నేను మీతో ఉన్నాను” అని సమస్త మానవాళికి తెలియ చేస్తాడు. అదే రక్షాబంధనం.
• జంధ్యము అంటే దేహం చుట్టూ కట్టబడి ఉండే వలయం. శ్రావణ పౌర్ణమి రోజు శివుని యొక్క శక్తి చంద్రుని వెన్నెల ద్వారా లో విశ్వం లో మానవాళి అంతటికీ వలయం వలే అందుతుంది. ఈ రోజు శివుని స్మృతి (మననం) చేయాలి. అందుకే ఈ రోజును జంధ్యాల పౌర్ణమి అంటారు.
• కాలక్రమేణా , ఇది జంధ్యాలు మార్చుకునే పండుగ గా మారింది , మరియు సోదరుడు , సోదరికి భౌతిక బంధనాల లో ఉండే దుఃఖం, సమస్యల నుండి రక్షణ కల్పించడానికి తోడుగా, నేనున్నాను అని చెప్పడానికి నిదర్శనం గా రాఖీ పండుగ జరుపుకుంటారు.
• శివ పరమాత్మ దృష్టిలో ప్రతీ ఒక్కరూ తన పిల్లలు. ఆత్మ దృష్టి తో చూస్తే అందరూ సోదర సోదరీమణులు. ఒకరికి మరొకరు రక్ష గా నిలబడితే, పరమాత్మ అందరికీ రక్ష గా ఉంటాడు. లేనిచో మాయ దుఃఖం లో బంధించి పతనం చేస్తుంది.
• రక్షా బంధనం కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే ఉద్దేశించిన పండుగ కాదు…. ఆత్మ బంధాలకు సంబంధించినది.
సత్యం శివం సుందరం
సత్యం - నిజం, నిజాయితీ.
శివం - కళ్యాణం, శుభకరం.
సుందరం - మనోహరం, సంతోషం.
సత్యం ఆచరించిన వారు శుభకరులై ఎల్లవేళలా మనోహరం గా ఉంటారు.
• ఏ బంధమైనా అర్థవంతంగా, సగౌరవంగా ఉంటే , ఆ బంధంలో విలువ పరిమళాన్ని ఇస్తుంది.
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 18 Aug 2024, 6:00 pm.
No comments:
Post a Comment